Begin typing your search above and press return to search.

ఆ సమయంలో నా కన్నీళ్లు ఆగలేదు

కెరీర్ లో సక్సెస్ అవ్వలేక పోతే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలి అనుకున్నట్లుగా తాజా ఇంటర్వ్యూలో కృతి సనన్ వెల్లడించింది.

By:  Tupaki Desk   |   4 Sept 2023 11:50 AM
ఆ సమయంలో నా కన్నీళ్లు ఆగలేదు
X

'మీమీ' సినిమా తో జాతీయ అవార్డు ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ కృతి సనన్. ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్‌ గా దూసుకు పోతున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఆదిపురుష్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం హిందీ లో రెండు మూడు సినిమాల్లో నటిస్తూ ఉంది. జాతీయ అవార్డు రాకతో మరిన్ని సినిమాలకు ఈమె సైన్‌ చేసే అవకాశం ఉంది.

జాతీయ అవార్డు సొంతం చేసుకున్న సంతోషాన్ని మీడియా తో షేర్‌ చేసుకుంటూ ఉన్న కృతి సనన్ తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్‌ ఆరంభం లో ఎదుర్కొన్న ఇబ్బందికర సంఘటనల గురించి మాట్లాడింది. మోడలింగ్ తో కెరీర్ ను ప్రారంభించిన కృతి సనన్‌ అదే సమయంలో చదువును కూడా కంటిన్యూ చేసినట్లుగా పేర్కొంది.

కెరీర్ లో సక్సెస్ అవ్వలేక పోతే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలి అనుకున్నట్లుగా తాజా ఇంటర్వ్యూలో కృతి సనన్ వెల్లడించింది. ఒక వైపు మోడలింగ్ చేస్తూనే మరోవైపు చదువు కొనసాగించాను. ఒకరోజు జరిగిన కార్యక్రమంలో మోడల్‌ గా గడ్డి లో హై హీల్స్‌ వేసుకుని నడవాల్సి వచ్చింది. అప్పుడు గడ్డి లో హీల్స్‌ ఇరుక్కు పోయి ఇబ్బంది పడ్డాను.

నేను చేసిన తప్పు ఏమీ లేకున్నా కూడా అక్కడ ఉన్న కొరియోగ్రాఫర్‌ అందరి ముందు నా పట్ల దురుసుగా వ్యవహరించాడు. అప్పుడు నాకు కన్నీళ్లు ఆగలేదు. అప్పుడు నేను నాకు నేనుగా చెప్పుకుని ముందడుగు వేశాను. ఆ సమయంలో కన్నీళ్లు ఆగలేదు.. కానీ నేను మాత్రం ఎలాంటి ముందు ముందు మరింత స్ట్రాంగ్ గా ఉండాలని అప్పుడే నిర్ణయించుకున్నాను అంది.

నేనొక్కడినే సినిమా చేస్తున్న సమయంలో మోడలింగ్‌ నుండి హీరోయిన్‌ గా కృతి సనన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కమర్షియల్‌ గా సక్సెస్ అవ్వక పోవడం తో బాలీవుడ్ లో ఈ అమ్మడు సినీ ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలు సఫలం అయి ఇప్పుడు బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్ గా దూసుకు పోతుంది.