ఫ్యాన్స్ పేజీల్లో కృతి బోల్డ్ లుక్ వైరల్
ఇటీవల కృతి షేర్ చేసిన ఓ ఫోటోషూట్‌లో బోల్డ్ గా చెలరేగిపోయిందంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు
By: Tupaki Desk | 17 May 2024 2:34 PM GMTబాలీవుడ్లో కృతి సనోన్ టైమ్ నడుస్తోంది. 'మిలీ' చిత్రంతో జాతీయ అవార్డ్ అందుకోవడమే గాక, ఇటీవల రెండు వరుస బ్లాక్ బస్టర్లను ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. తేరీ వతన్ మే ఐసా ఉల్జా జియా, క్రూ లాంటి చిత్రాలు 100 కోట్ల మైలురాయిని చేరుకున్నాయి. ఈ సినిమాల్లో కృతి నటనపై గొప్ప ప్రశంసలు కురిసాయి. ఇదే హుషారులో కృతి ఫ్యాషన్ గేమ్‌ని ఛేంజ్ చేసింది. మునుపటితో పోలిస్తే మరింత హాట్ ఫోటోషూట్లతో వెబ్ లో విరుచుకుపడుతోంది.
ఇటీవల కృతి షేర్ చేసిన ఓ ఫోటోషూట్‌లో బోల్డ్ గా చెలరేగిపోయిందంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్‌గా మారుతోంది. కృతి క్రీమ్ కలర్ టాప్.. కాంబినేషన్ క్రీమ్ కలర్ బాటమ్ ని ధరించి దానిని లాంగ్ కోట్ తో కవరప్ చేసింది. కృతి ఈ డిజైనర్ లుక్ లో టూ బోల్డ్ గా ఉందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ లుక్ కి తగ్గట్టే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అంటూ సింపుల్ క్యాప్షన్ ని ఇచ్చి కృతి ట్రెండ్స్ అనే ఇన్‌స్టాలో అభిమానులు వైరల్ చేస్తున్నారు.
మరోవైపు కృతి సనోన్ ఇటీవల కొన్ని గట్సీ స్టేట్మెంట్లతో ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా పరిశ్రమలో వేతన అసమానత గురించి కొనసాగుతున్న డిబేట్లో చేరింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ మీడియా పోర్టల్‌తో మాట్లాడుతూ తాను, కరీనా, టబు క్రూ చిత్రంలో నటించినందుకు తమ ప్రతిభకు తగ్గట్టు కాకుండా పరిమితంగా పారితోషికాలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. హీరోలతో పోలిస్తే తమ పారితోషికం చాలా తక్కువ అని తెలిపింది. నాయికా ప్రధాన చిత్రాలు కాకుండా మేల్ స్టార్లతో సినిమాలు చేసినప్పుడు వారికి పెద్ద పారితోషికాలు ముట్టజెబుతున్నారని కృతి వ్యాఖ్యానించింది. హీరోలతో సినిమాల కోసం ఖర్చు చేసినంతగా మహిళా నటీమణులపై ఖర్చు చేసేందుకు ఎవరూ ఆసక్తిగా ఉండరని కృతి వెల్లడించింది. నాయికా ప్రధాన చిత్రాలపై పెట్టుబడి పెడితే డబ్బు తిరిగి వస్తుందా? అని భయపడుతున్నారని కూడా వ్యాఖ్యానించింది. మహిళా నటీమణుల కంటే మేల్ ఆర్టిస్టులకు పది రెట్లు ఎక్కువ వేతనం లభిస్తుందని కూడా అంది. మేల్- ఫీమేల్ స్టార్ల మధ్య చెల్లింపులో వ్యత్యాసం ఎటువంటి కారణం లేకుండా కూడా భారీగా ఉంది. గడిచిన పదేళ్లలో హిట్టు అన్నదే ఇవ్వని హీరో పారితోషికం మనకంటే పది రెట్లు అధికంగా ఉందని కృతి అంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్‌లతో కలిసి తరుణ్ మన్సుఖాని హౌస్‌ఫుల్ 5 లో నటించనుంది. కాజోల్‌తో కలిసి క్రైమ్ థ్రిల్లర్ 'దో పట్టి'లోను కనిపించనుంది. ఈ చిత్రం బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్ బ్యానర్ లో కృతి నిర్మిస్తోంది. నిర్మాతగా ఇది తనకు తొలి చిత్రం. అంతేకాకుండా వరుణ్ ధావన్ సరసన భేదియా 2 లోను నటించనుంది.