జాతీయ ఉత్తమ నటి ఇండస్ట్రీ పై పంచ్!
బాలీవుడ్ లో వారసత్వం ప్రకంపనలు రేపుతూనే ఉంటుంది. ఇండస్ట్రీ బిడ్డలకే అవకాశాలిస్తున్నారన్న చర్చ ఎప్పటికప్పుడు జరుగుతుంటుంది.
By: Tupaki Desk | 17 Nov 2023 5:30 PM GMTబాలీవుడ్ లో వారసత్వం ప్రకంపనలు రేపుతూనే ఉంటుంది. ఇండస్ట్రీ బిడ్డలకే అవకాశాలిస్తున్నారన్న చర్చ ఎప్పటికప్పుడు జరుగుతుంటుంది. ప్రతిభావంతుల్ని పక్కనబెట్టి మరీ ప్రోత్సహిస్తున్నారనే విమర్శ చాలా కాలంగా ఉంది. కంగనా రనౌత్ ఈ విషయంపై ఎన్నోసార్లు నర్మగర్భంగా తన అభిప్రాయాన్ని చెప్పింది. ఇంకా దీపికా పదుకొణే.. తాప్సీ సహా కొంత మంది భామలు సందర్భం వచ్చినప్పుడు స్పంది స్తుంటారు.
ఈ నేపథ్యంలో తాజాగా జాతీయ ఉత్తమ నటి కృతి సనన్ కూడా చురకలంటించింది. సినీ కుటుంబం నుంచి వచ్చిన వారికే కాదు..కొత్త వారికి కూడా అవాకశాలిస్తే జీవనాధరం దొరుకుతుంది. ఈ రంగంలో ఉన్న వారికి ఓ దారి దొరికినట్లు అవుతుంది. ఒక సినిమా లేదా వెబ్ సిరీస్ తో కొత్త వారిని నటీనటుల్ని సినిమా రంగానికి పరిచయం చేస్తున్నామంటే వారికున్న ప్రతిభ మాత్రమే కారణం. అలా ట్యాలెంట్ ఉన్న వారంద ర్నీ గుర్తించి అవకాశాలు కల్పించాలి అన్నది నా అభిప్రాయం.
అవకాశం కోసం ఎన్ని ఇబ్బందులు పడాలో నాకు తెలుసు. సినిమా తారలు..పెద్ద స్టార్ల ప్రతిభ కంటే..మంచి కథలవైపే ప్రేక్షకుల మొగ్గు చూపుతున్నారు. అలాంటి కథల్లో ప్రతిభవంతులు కనిపిస్తే ఫలితం మరింత గొప్పగా ఉంటుంది. పరిశ్రమ ఆరకంగా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను` అంది. మోడల్ గా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కుని నేషనల్ స్టార్ అయింది కృతిసనన్. అమ్మడికి తొలి ఛాన్స్ ఇచ్చింది టాలీవుడ్.
మహేష్ హీరోగా నటించిన `వన్ నేనొక్కడినే`లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాతే బాలీవుడ్ లో `హీరో పంటీ`లో నటించే ఛాన్స్ వచ్చింది. కృతిసనన్ ఢిల్లీ నుంచి బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసి అటుపై టాలీవుడ్ కి వచ్చింది. ఇక్కడ వైఫల్యాలు కొత్త అవకాశాల్ని దూరం చేసాయి. దీంతో మళ్లీ బాలీవుడ్ కి తిరుగెళ్లి నేడు జాతీయ ఉత్తమ నటిగా నీరాజనాలు అందుకుంటోంది.