Begin typing your search above and press return to search.

కృతి శెట్టి మత్స్యకన్య అవ‌తారం

ఈ రూపం చూసి స‌ప్త స‌ముద్రాల ఆవల నుంచి వచ్చిన మ‌త్స్య‌క‌న్య అంటూ ఫ్యాన్స్ స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 5:02 AM GMT
కృతి శెట్టి మత్స్యకన్య అవ‌తారం
X

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో వ‌ర‌స ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తున్న కృతి శెట్టి ఇప్పుడు మ‌రోసారి మ‌తి చెడ‌గొట్టే ఫోటోషూట్ ని షేర్ చేసింది. దీనికి అంద‌మైన క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. ``మత్స్యకన్య ముద్దులు.. స్టార్ ఫిష్ శుభాకాంక్షలు`` అంటూ వ్యాఖ్య‌ను జోడించింది. అయితే ఈ క్యాప్ష‌న్ కి త‌గ్గ‌ట్టే కృతి మ‌త్స్య‌క‌న్య‌లా మారిపోయి క‌నిపించింది. అలాగే ఇదే రూపానికి స్టార్ ఫిష్ ఎట్రాక్ష‌న్ ని జోడిస్తూ రంగుల‌ను అద్ద‌డం ఆస‌క్తిక‌రం. ఒకే భామ ఒక‌టే డ్రెస్సు.. కానీ ఎంత విల‌క్ష‌ణ‌త‌. కృతి అందం మైండ్ బ్లాంక్ చేస్తోందంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. త‌న అంద‌మైన క‌ర్లీ హెయిర్ ని ఈ ఫోటోషూట్లో అంతే అందంగా ఆవిష్క‌రించింది. ఈ రూపం చూసి స‌ప్త స‌ముద్రాల ఆవల నుంచి వచ్చిన మ‌త్స్య‌క‌న్య అంటూ ఫ్యాన్స్ స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు.


కృతి జాతీయ అవార్డును గెలుచుకున్న `ఉప్పెన` మూవీకి అభినందనలు. యు కెన్ డిజర్వ్ ఫర్ హార్డ్ వర్క్ & మీ డిటర్మినేషన్ & మీ పెర్ఫార్మెన్స్ మీకు సపోర్ట్ చేయడానికి మేం ఎల్లవేళలా మీ కోసం ఉన్నాం.. నా ప్రేమ!! మీ అన్ని ఉత్తమ భవిష్యత్ ని ఇచ్చే ప్రాజెక్ట్‌లు & మరోసారి మీ అవార్డ్ విన్నింగ్ లవ్‌కి అభినందనలు అని కృతిపై ఒక అభిమాని ప్రేమ‌ను కురిపించారు.


ప‌రాజ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటున్న కృతిని రామ్ వారియ‌ర్ .. నితిన్ -మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం తీవ్రంగా నిరాశ‌రిచాయి. ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కూడా ఫ్లాప్. మ‌ల‌యాళంలో త‌దుప‌రి అజ‌యంటే రాండ‌మ్ మోష‌న‌మ్ అనే చిత్రంలో న‌టిస్తోంది. జీనీ అనే మ‌రో చిత్రంలోను న‌టిస్తూ బిజీగా ఉంది. ప్ర‌స్తుతం ఇవి రెండూ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి.


కృతి త‌మిళంలో కార్తీ స‌ర‌స‌న అవ‌కాశం అందుకుంది. కార్తీ తదుపరి దర్శకుడు నలన్ కుమారసామితో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఇది గత ఏప్రిల్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రానికి కృతి గ్లామ‌ర్ అస్సెట్ కానుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు 80శాతం పూర్తయింది. ఈ చిత్రంలో కార్తీ MGR అభిమానిగా నటిస్తున్నట్లు సమాచారం. కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, సత్యరాజా విలన్‌గా నటిస్తున్నారు.