Begin typing your search above and press return to search.

కుబేర.. అలా పెరిగిపోతూనే ఉందట!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో కుబేర మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Dec 2024 10:30 PM GMT
కుబేర.. అలా పెరిగిపోతూనే ఉందట!
X

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో కుబేర మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే హ్యాపీ డేస్, ఆనంద్, గోదావరి వంటి మూవీస్ తో అలరించిన ఆయన.. ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో కుబేర చేస్తున్నారు.

శేఖర్ కమ్ముల మూవీ అంటే కచ్చితంగా అందులో బలమైన కథ ఉంటుంది. ఇప్పుడు కుబేర భిన్నమైన సోషల్‌ డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ధనుష్ మునుపెన్నడూ చేయని రోల్ లో కనిపించనున్నట్టు ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. సినిమాలో బిచ్చగాడిగా నటిస్తున్నట్లు అర్థమవుతోంది.

కింగ్ నాగార్జున.. ఈడీ అధికారి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. సంపద, దురాశ, ఆశయం అంశాల చుట్టూ సినిమా అంతా తిరుగుతుందని తెలుస్తోంది. అలా శేఖర్ కమ్ముల కుబేరతో పెద్ద ప్రయోగమే చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ స్టోరీ లైన్ లీక్ అవ్వకుండా బాగా జాగ్రత పడుతున్నారు. డైరెక్ట్ గా స్క్రీన్ పైనే అర్థమయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.

అదే సమయంలో కుబేర మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే టాకీ పార్ట్ చాలా వరకు కంప్లీట్ అయింది. కొన్ని సాంగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నట్లు సమాచారం. అయితే కుబేర చిత్రాన్ని 2024 దీపావళికి రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చే ఏడాది ఫిబ్రవరి మూడో నెలలో విడుదల చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అందుకు తగ్గ ఏర్పాట్లను ఇప్పటికే మొదలుపెట్టారని వినికిడి. అయితే పాన్‌ ఇండియా సినిమా అయిన కుబేరను రూ.90 కోట్ల బడ్జెట్ తో పూర్తి చేయాలని మేకర్స్ ముందుగా నిర్ణయించుకున్నారట. షూటింగ్ జరుగుతున్న కొద్దీ బడ్జెట్ అలా పెరిగిపోతుందట. మొత్తం రూ.120 కోట్లు అవుతుందని తెలుస్తోంది. కానీ నిర్మాతలు ఎక్కడా వెనకడుగు వేయడం లేదని సమాచారం.

శేఖర్ కమ్ములపై నమ్మకంతో భారీగా ఖర్చు పెడుతున్నారని టాక్ వినిపిస్తోంది. సునీల్‌ నారంగ్, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌ రావు కుబేరను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరి కుబేర ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.