Begin typing your search above and press return to search.

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కుబేర‌

విజ‌న‌రీ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కుబేర. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో కుబేర కూడా ఒక‌టి.

By:  Tupaki Desk   |   27 Feb 2025 5:24 AM GMT
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కుబేర‌
X

విజ‌న‌రీ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కుబేర. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో కుబేర కూడా ఒక‌టి. ఈ చిత్రాన్ని జూన్ 20న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నట్టు మేక‌ర్స్ అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేశారు.


ధ‌నుష్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంది. బాలీవుడ్ లో వైవిధ్య‌మైన పాత్ర‌లు చేస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న జిమ్ స‌ర్బ్ కుబేర‌లో ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. వీరంతా కుబేరలో త‌మ కెరీర్లో మునుపెన్న‌డూ చేయ‌ని స‌రికొత్త పాత్ర‌లు చేస్తున్నారు.

రిలీజ్ డేట్ పోస్ట‌ర్ లో నాగార్జున‌, ధ‌నుష్ ఎదురెదురుగా చాలా ఇంటెన్స్ లుక్ లో క‌నిపించ‌గా, బ్యాక్ గ్రౌండ్ లో జిమ్ స‌ర్బ్ పాత్ర ప‌వ‌ర్‌ఫుల్ గా ఉండ‌నున్న‌ట్టు ఆయ‌న అప్పియరెన్స్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే కుబేర నుంచి ప్ర‌ధాన పాత్ర‌ల‌ను ప‌రిచయం చేస్తూ గ్లింప్స్ ను రిలీజ్ చేయ‌గా ప్ర‌తీ గ్లింప్స్ ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఈ సినిమాలో ధ‌నుష్‌, నాగార్జున మ‌ధ్య వ‌చ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయ‌ని అంద‌రూ ముందు నుంచే చెప్తున్నారు. 90వ ద‌శ‌కం నేప‌థ్యంలో రూపొందుతున్న సినిమా కావ‌డంతో కుబేర కోసం స్పెష‌ల్ సెట్స్ వేసి మ‌రీ షూట్ చేశారు. సెట్స్ కోస‌మే నిర్మాత‌లు చాలా భారీగా ఖ‌ర్చు పెట్టార‌ని టాక్ కూడా వ‌చ్చింది.

ఓ సాధార‌ణ బిచ్చ‌గాడు వేల కోట్లు సంపాదించే ధ‌న‌వంతుడిగా మారితే అత‌నికి ఎదుర‌య్యే ప‌రిణామాలు ఎలా ఉంటాయ‌నే నేప‌థ్యంలో కుబేర రూపొందుతుంది. సునీల్ నారంగ్, రామ్ మోహ‌న్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఎలాగూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కాబ‌ట్టి ఇక మీద‌ట కుబేర నుంచి వ‌రుస అప్డేట్స్ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.