మనోళ్లు ఇంకా అలాగే ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు!
అంటే తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ యు.కెమోహనన్ వ్యాఖ్యల్ని బట్టి కొన్ని విషయాలు అంచనా వేయోచ్చని తెలుస్తోంది.
By: Tupaki Desk | 29 March 2024 1:30 AM GMTటాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలంటే 'బాహుబలి'..'ఆర్ ఆర్ ఆర్' ..'పుష్ప'..'కార్తికేయ-2' ఇవే గుర్తొస్తాయి. ఆ తర్వాత పాన్ ఇండియాలో ఏదైనా సినిమా రిలీజ్ అయిందా? అంటే ఎక్కడా కనిపించదు. కానీ పాన్ ఇండియాలో చేస్తున్నామని బడాయి కబుర్లు మాత్రం వినిపిస్తుంటాయి. పొర పాటున చేసి రిలీజ్ చేసినా అవి ఎత్తిపోయిన చిత్రాలుగానే కనిపిస్తాయి. రాజమౌళి...చందు మొండేటి...సుకుమార్ వీళ్లు మాత్రమే తీయగలరా? వీళ్లకి మాత్రమే ఆ పేటెంట్ హక్కులు ఉన్నాయా? అన్న సందేహం కూడా వచ్చేస్తుంది ఒక్కోసారి.
మరి ఈ తరహా ప్రయత్నాలు మిగతా మేకర్స్ ఎందుకు చేయడం లేదు? వాళ్ల పేర్లు ఎందుకు పాన్ ఇండియాలో ఫేమస్ అవ్వడం లేదు? అంటే తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ యు.కెమోహనన్ వ్యాఖ్యల్ని బట్టి కొన్ని విషయాలు అంచనా వేయోచ్చని తెలుస్తోంది. 'తెలుగు సినిమా నేడు పాన్ ఇండియా మార్కెట్ ని శాషించగల సత్తా ఉంది. కానీ ఇప్పటికీ చాలా మంది దర్శకులు పాత పద్దితిలో కథలు చెబుతున్నా రన్నారు. సహజత్వానికి దూరంగా సినిమాల్ని రూపొందిస్తున్నారన్నారు.
'ప్రేక్షకులు కొరుకునేది ఇదే అంటూ వాళ్లపై నిందలు వేస్తున్నారు. ప్రేక్షకులు ఎప్పుడూ స్వీకరించే వాళ్లే. వాళ్లకు మనం ఏం ఇస్తున్నాం? అన్నది ముఖ్యం. మలయాళంలోనూ ..తమిళంలోనూ ప్రయోగాలు చేస్తున్నారు. వందేళ్ల క్రితం రాసుకున్నట్లే డ్రామాతో కూడిన స్క్రిప్ట్ లు ఇప్పటికీ రాసుకుంటున్నారు. దర్శకులు కొత్త ఆలోచనలతో వస్తే సినిమాటో గ్రఫీతో పాటు అన్ని విభాగాలు మారుతాయని అభిప్రాయపడ్డారు.
దీంతో ఆయన అభిప్రాయంపై కొంత మంది విశ్లేషకులు మద్దతు పలుకుతున్నారు. తెలుగు సినిమా పాన్ ఇండియాలోనూ..ఆస్కార్ రేంజ్ కి చేరినప్పుడు? ఇక్కడ నుంచి ఎంత గొప్ప కంటెంట్ వెళ్లాలి. కానీ అలా జరగడం లేదు. ఇప్పటీకి ఇంకా మూస కంటెంట్ తోనే సినిమాలు చేస్తున్నారు. వాటిలో కొన్ని సినిమాలు స్థానికంగా మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. దాన్ని స్వాగతించాల్సిన అంశమే. కానీ ఇక్కడే పాన్ ఇండియా మార్కెట్ పై ప్రభావం పడుతుంది. కొంత మంది ప్రతిభావంతులకు పాన్ ఇండియాలో తీయాలని ఉన్నా? ధైర్యం చేయలేక మూసధోరణిలోకి వెళ్లిపోతున్నారు. ప్రత్యక్షగానో..పరోక్షంగానో కొన్ని విజయాలు కొందర్నీ వెనక్కి లాగుతున్నాయి. ఆ కారణంగానూ ధైర్యంగా పాన్ ఇండియా వైపు అడుగులు వేయలేకపోతున్నారు.