Begin typing your search above and press return to search.

విశ్వంభర.. మరో పవర్ఫుల్ క్యారెక్టర్ ను దింపారుగా..

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో కంప్లీట్ డిఫరెంట్ జోనర్ లో చేస్తోన్న మూవీ ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

By:  Tupaki Desk   |   14 Jun 2024 6:11 AM GMT
విశ్వంభర.. మరో పవర్ఫుల్ క్యారెక్టర్ ను దింపారుగా..
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ విశ్వంభర. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రం సిద్ధం అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో కంప్లీట్ డిఫరెంట్ జోనర్ లో చేస్తోన్న మూవీ ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వశిష్ట మల్లిడి నుంచి ఈ మూవీ వస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా స్టార్ హీరోయిన్ త్రిష ఎంపికైంది. ఇప్పటికే ఆమె షూటింగ్ లో పాల్గొంది. అలాగే మరో నలుగురు హీరోయిన్స్ ఈ చిత్రంలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ చిత్రం జగదేక వీరుడు అతిలోకసుందరి తరహాలో విశ్వంభర మూవీ ఉంటుందనే ప్రచారం నడుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర మూవీ కోసం ప్రత్యేకంగా సిద్ధం అయ్యారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ కూనాల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అతని క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కూనాల్ కపూర్ బాలీవుడ్ లో 2004లో నటుడిగా కెరియర్ ప్రారంభించాడు. మీనాక్షి ఏ టేల్ ఆప్ త్రీ సిటీస్ అనే చిత్రంతో తెరంగేట్రం చేశారు. తర్వాత వరుస సినిమాలు చేస్తూ మంచి టాలెంటెడ్ యాక్టర్ అనిపించుకున్నాడు.

తెలుగులో నాగార్జున, నాని కాంబినేషన్ లో మల్టీస్టారర్ గా వచ్చిన దేవదాస్ సినిమాలో కూడా నటించాడు. ఈ చిత్రంలో కునాల్ కపూర్ ప్రతినాయకుడిగా కనిపించారు. కానీ అదేమీ అంతగా క్లిక్ కాలేదు. ఇక మరల చాలా కాలం తర్వాత విశ్వంభర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. చిత్రంలో ఆయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో కచ్చితంగా కునాల్ కపూర్ కి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. విశ్వంభర సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం మరి కొంతమంది స్టార్ యాక్టర్స్ ను ఎంపిక చేయబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక సినిమాను 2025 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది.