Begin typing your search above and press return to search.

కుందనాల బొమ్మ… ప్యూర్ మెలోడీ

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల నుంచి ప్రేక్షకులకి గుర్తుండిపోయే మంచి సాంగ్స్ వస్తున్నాయి

By:  Tupaki Desk   |   7 Aug 2024 10:30 AM GMT
కుందనాల బొమ్మ… ప్యూర్ మెలోడీ
X

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల నుంచి ప్రేక్షకులకి గుర్తుండిపోయే మంచి సాంగ్స్ వస్తున్నాయి. మెలోడీ గీతాలకి దర్శకులు పెద్దపీట వేస్తున్నారు. తాజాగా ధూమ్ ధామ్ సినిమా నుంచి కుందనాల బొమ్మ అంటూ సాగే ప్యూర్ మెలోడీ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ పాటని లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు రిలీజ్ చేశారు. చేతన్ కృష్ణ హీరోగా నటించిన ఈ మూవీలో హెబ్బా పటేల్ ఫీమేల్ లీడ్ రో కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి.

మల్లెపూల ట్యాక్సీ అంటూ సాగే పాటని రెండు నెలల క్రితం రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ని మంగ్లీ, సాహితీ చాగంటి ఆలపించారు. తరువాత అనురాగ్ కులకర్ణి ఆలపించిన మాయ సుందరి సాంగ్ ప్రేక్షకుల ముందుకి రాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. గీతా మాధురి, శ్రీకృష్ణ ఆలపించిన టమోటో బుగ్గల పిల్ల సాంగ్ రిలీజ్ అయ్యింది. దీనికి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. తాజాగా వచ్చిన కుందనాల బొమ్మ సాంగ్ పై ఇంకా ఎక్కువ పాజిటివ్ వైబ్ క్రియేట్ అవ్వడం విశేషం.

ఈ సాంగ్ ని శ్రీకృష్ణ ఆలపించారు. ధూమ్ ధామ్ లో సాంగ్స్ అన్నింటికి కూడా రామజోగయ్య శాస్త్రీ లిరిక్స్ సమకూర్చారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ నుంచి మ్యూజిక్ ఫీస్ట్ గా ఈ మూవీ ఆల్బమ్ వచ్చింది. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో ధూమ్ ధామ్ సినిమా తెరకెక్కింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో సిద్ధం చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఈ మధ్యకాలంలో తెలుగులో వచ్చిన బెస్ట్ సాంగ్స్ లలో ధూమ్ ధామ్ పాటలు కూడా ఉంటాయనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా స్వచ్ఛమైన తెలుగు వాచకంతో పాటలలో లిరిక్స్ ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చేతన్ కృష్ణ కూడా ఈ చిత్రంతో సాలిడ్ సక్సెస్ అందుకుంటాడని అంచనా వేస్తున్నారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎం.ఎస్ రామ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ ఏడాది ది ఫ్యామిలీ స్టార్, ఆ ఒక్కటి అడక్కు సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. ధూమ్ ధామ్ తో పాటు మరో జితేందర్ రెడ్డి, శబరి సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. మరి ఈ చిత్రాలలో ఎన్ని సక్సెస్ అందుకుంటాయనేది చూడాలి.