Begin typing your search above and press return to search.

అతి ప్రేమ ద్వేషంగా మారితే ఇలా!

కున్వ‌ర్ అమ‌ర్ జీత్- న‌టి శ‌క్తి మోహ‌న్ అంటే బుల్లి తెర‌పై ఎంతో క్రేజ్ సంబంధించారు. ఇద్ద‌రు న‌టించిన సీరియ‌ళ్లు మంచి విజ‌యం సాధించాయి.

By:  Tupaki Desk   |   9 Jun 2024 4:30 PM GMT
అతి ప్రేమ ద్వేషంగా మారితే ఇలా!
X

ప్ర‌భాస్- అనుష్క కాంబినేష‌న్ వెండి తెర‌పై ఎంత అందంగా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ కాంబినేష‌న్ లో ఎన్ని సినిమాలొచ్చినా చూడాలనిపిస్తుంది. అభిమానులు ప‌దే ప‌దే ఆ కాంబినేష‌న్ రిపీట్ అయితే బాగుండంటారు. చివ‌రికి ఆ ర‌క‌మైన ఆస‌క్తి ఎంత‌వ‌ర‌కూ దారి తీసిందో కూడా తెలిసిందే. ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డార‌ని..పెళ్లి చేసుకుం టార‌ని కూడా నెట్టింట ప్ర‌చారం సాగింది. ఆ జోడీ ఒక‌టైతే సూప‌ర్ గా ఉంటుంద‌ని భావించారు.

కానీ వాళ్లిద్దరి మ‌ధ్య స‌న్నివేశం వేరు. ఆ రిలేష‌న్ షిప్ కేవ‌లం స్నేహం వ‌ర‌కే పరిమితం. ఎలాంటి ల‌వ్ లేదు. న‌టులుగా కాంబినేషన్ సెట్ అయింది క‌లిసి ప‌నిచేసారంతే? అంత‌వ‌ర‌కూ ప‌రిమితం. ఆ త‌ర్వాత ఈ విష‌యంపై పెద్ద చ‌ర్చ సాగ‌లేదు. ఇలాంటి కాంబినేష‌న్ బాలీవుడ్ లో కూ ఒక‌టుంది. కున్వ‌ర్ అమ‌ర్ జీత్- న‌టి శ‌క్తి మోహ‌న్ అంటే బుల్లి తెర‌పై ఎంతో క్రేజ్ సంబంధించారు. ఇద్ద‌రు న‌టించిన సీరియ‌ళ్లు మంచి విజ‌యం సాధించాయి.

దీంతో ఆ జంట రియ‌ల్ లైఫ్ లోనూ ఒక‌టిగా చూడాల‌ని అభిమానులు ఆశ‌ప‌డ్డారు. పెళ్లి చేసుకుంటే బాగుంటుంద‌ని బాహాటంగానే చెప్పేసారు. కానీ కున్వ‌ర్ అప్ప‌టికే చార్లీ చౌహాన్ తో ల‌వ్ లో ఉన్నాడు. కొన్నాళ్ల త‌ర్వాత వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహం అభిమానుల‌కు మింగుడు ప‌డ‌లేదన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. మీజోడీ బాగోలేద‌ని కున్వ‌ర్ ముందే చాలా మంది చెప్పారుట‌.

`దిల్ దోస్తీ డాన్స్ సీరియ‌ల్ లో నా పాత్ర‌ను ప్రేక్ష‌కులు మెచ్చారు. నాతో జోడీ క‌ట్టిన అమ్మాయినే ప్రేమించాల‌ని ఆశ‌ప‌డ్డారు. కానీ అప్ప‌టికే నేను చార్లీతో ల‌వ్ లో ఉన్నాను. దీంతో చార్లీని అంతా ద్వేషించారు. ప‌బ్లిక్ గానూ చాలా మంది తిట్టారు. నాలుగేళ్లు క‌లిసి ఉన్నాం. త‌ర్వాత ప‌రిస్థితుల కార‌ణంగా విడిపోయాం. వివాహం..విడిపోవ‌డం అనేది మ‌న చేతుల్లో ఉండ‌దు. జీవితం అనే జ‌ర్నీలో ముందుకు సాగిపోతాయి` అని అన్నారు. చూసారా అతి అభిమానం ఎంత‌వ‌ర‌కూ దారి తీస్తుందో? చివ‌రికి ఎవర్నీ పెళ్లి చేసుకోవాలో కూడా అభిమానులే డిసైడ్ చేసే స్థాయికి అభిమానం పెరిగిపోయింది.