కుర్చీ మడత పెట్టి @550M
2024లో యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుని, అత్యధిక సార్లు ప్లే అయిన పాటగా కుర్చీ మడత పెట్టి పాట నిలిచింది.
By: Tupaki Desk | 23 Jan 2025 10:18 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొంది గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ నిరాశ పరచింది. కానీ సినిమాలోని పాటలు మాత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా కుర్చీ మడత పెట్టి సాంగ్ గ్లోబల్ రేంజ్‌లో ట్రెండ్ అయ్యింది. 2024లో యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుని, అత్యధిక సార్లు ప్లే అయిన పాటగా కుర్చీ మడత పెట్టి పాట నిలిచింది. ఆ విషయాన్ని యూట్యూబ్ అధికారికంగా తన 2024 చార్ట్ బస్టర్ జాబితాలో పేర్కొంది. ఇండియా నుంచి కేవలం ఆ పాటకు మాత్రమే ఆ ఘనత దక్కింది.
తెలుగు ప్రేక్షకులు గర్వించే విధంగా ప్రపంచ స్థాయిలో పాటకు రీచ్ దక్కింది. హాలీవుడ్ టాప్ ఆల్బమ్స్‌తో పోటీ పడి మరీ ఈ పాట రికార్డ్ స్థాయి వ్యూస్‌ను సొంతం చేసుకుంది. యూట్యూబ్‌తో పాటు యూట్యూబ్ మ్యూజిక్‌లో కుర్చీ మడత పెట్టి సాంగ్ దక్కించుకున్న వ్యూస్ సరికొత్త రికార్డ్‌ను సృష్టించాయి. తాజాగా ఈ పాట యూట్యూబ్‌లో ఏకంగా 550 మిలియన్‌ల వ్యూస్‌ను రాబట్టింది. ఆదిత్య మ్యూజిక్ వారు అధికారికంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. కుర్చీ మడత పెట్టి వచ్చి ఏడాది దాటినా, సినిమా ఫ్లాప్ అయినా వస్తున్న స్పందన చూస్తే ఆశ్చర్యంగా ఉంది అంటూ సినీ వర్గాల వారు స్వయంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆధిత్య మ్యూజిక్ వారు ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసిన సమయంలో తమన్ స్పందిస్తూ 550 మిలియన్ వ్యూస్ బ్లాక్ అంటూ ట్వీట్ చేశారు. కుర్చీ మడత పెట్టి పాట గ్లోబల్ రేంజ్‌లో రీచ్ కావడం వల్లే ఈ రికార్డ్ స్థాయి వ్యూస్ లభించాయని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా లక్షలాది మంది ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. లక్షల మంది రీల్స్ చేశారు. డాన్స్‌తో మతి పోగొట్టారు. ఇటీవల నేపాల్‌కి చెందిన అమ్మాయిలు వేసిన కుర్చీ మడత పెట్టి స్టెప్స్ వైరల్ అయిన విషయం తెల్సిందే. అంతర్జాతీయ స్థాయిలో దక్కిన స్పందన కారణంగానే ఈ స్థాయి వ్యూస్ దక్కాయి.
తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపిక అయిన సమయంలో చాలా మంది మహేష్ బాబు అభిమానులు వ్యతిరేకించారు. ఈ మధ్య కాలంలో ఆయన పనితనం బాగాలేదు. అందుకే మీరు మరో సంగీత దర్శకుడిని ఎంపిక చేయాలంటూ త్రివిక్రమ్‌కి విజ్ఞప్తి చేసిన వారు చాలా మంది ఉన్నారు. తనపై వచ్చిన విమర్శలకు పాటతో తమన్ సమాధానం ఇచ్చాడు. గుంటూరు కారం పాట కి సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ పదం ను తీసుకోవడం ఏంటి అంటూ చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేష్ బాబు సినిమాలో మరీ ఇంత నాసిరకం పద ప్రయోగం అవసరమా అంటూ కొందరు వ్యతిరేకించారు. అందరికీ ఇదే సమాధానం అన్నట్లు 550 మిలియన్ వ్యూస్ నిలిచాయి. ఈ ఏడాదిలో వెయ్యి మిలియన్ వ్యూస్‌ను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.