Begin typing your search above and press return to search.

కుర్చీ తాతకు రెమ్యునరేషన్ కూడా..

కుర్చీ మడతపెట్టి డైలాగ్ సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే

By:  Tupaki Desk   |   31 Dec 2023 5:42 AM GMT
కుర్చీ తాతకు రెమ్యునరేషన్ కూడా..
X

కుర్చీ మడతపెట్టి డైలాగ్ సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ డైలాగ్ ఓ ట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఓ తాత సీరియస్ గా అంటాడు. నిజానికి అదొక బూతు పధం. అయితే దానిని సగంలోనే కట్ చేయడంతో కాస్తా పాపులర్ అయ్యింది. ఇక ఈ డైలాగ్ వైరల్ కావడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తోన్న గుంటూరు కారం సినిమాలో సాంగ్ కోసం వాడేసారు.

తాజాగా ఈ సినిమా నుంచి శ్రీలీల, మహేష్ మీద చిత్రీకరించిన మాస్ డ్యూయెట్ ని రిలీజ్ చేశారు. ఇందులో కుర్చీ మడతపెట్టి అని తాత వాయిస్ తో ఒక హమ్మింగ్ బిట్ ని థమన్ ఉపయోగించాడు. సాంగ్ కూడా బాగుండటంతో ఈ డైలాగ్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాగే డైలాగ్ చెప్పిన తాతని కూడా చాలా మంది ఇంటర్వ్యూలు చేయడం మొదలు పెట్టారు.

మహేష్ బాబు సినిమాలో తన డైలాగ్ ని సాంగ్ బిట్ లో వాడుకోవడం నిజంగా సంతోషంగా ఉందని తాత చెప్పాడు. ఇదిలా ఉంటే ఈ బిట్ కోసం తాతకి ఏమైనా థమన్ రెమ్యునరేషన్ ఇచ్చాడా అనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఆ బిట్ కోసం తాతకి థమన్ మంచి ఎమౌంట్ ఇచ్చారంట. దాంతో తాత కూడా హ్యాపీ అయినట్లు తెలుస్తోంది.

ఈ రోజుల్లో చాలా మంది లెరిక్ రైటర్స్ కి కనీసం రెమ్యునరేషన్ ఇవ్వకుండా వాడేస్తున్నారు. అలాంటిది ఒక్క బిట్ ఉపయోగించుకున్నందుకు థమన్ మంచి రెమ్యునరేషన్ గా ఆ తాతకి ఇవ్వడం నిజంగా గ్రేట్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతోంది. జనవరి మొదటి వారం నుంచి ప్రమోషన్స్ షురూ చేసే అవకాశం ఉంది.

ఈ సినిమాతో మహేష్ బాబు 300 కోట్ల కలెక్షన్స్ మార్క్ ని అందుకుంటాడని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. మాస్ కమర్షియల్ కథాంశంతో వస్తోన్న సినిమా కావడంతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. చిత్ర యూనిట్ కూడా మూవీ అవుట్ పుట్ పై చాలా పాజిటివ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.