Begin typing your search above and press return to search.

'కూర్చీ మడతపెట్టి' రికార్డుల్లో త‌గ్గేదేలే

ఈ వీడియో సాంగ్ దాదాపు 300 మిలియన్ల వీక్షణలను 2 మిలియన్లకు పైగా లైక్‌లను సంపాదించింది. నిజానికి ఇది టాలీవుడ్‌లో అసాధారణమైన ఫీట్.

By:  Tupaki Desk   |   9 Jun 2024 6:03 AM GMT
కూర్చీ మడతపెట్టి రికార్డుల్లో త‌గ్గేదేలే
X

మ‌హేష్ న‌టించిన గుంటూరు కారం వైబ్స్ ఇంకా క‌నిపిస్తున్నాయ్. సినిమా ఫ్లాపైనా కానీ, కుర్చీ మ‌డ‌త పెట్టి పాట గురంచి ఇంకా మాట్లాడుతున్నారంటే, ఇది క‌చ్ఛితంగా మాస్ లోకి ఏ రేంజులో దూసుకెళ్లిందో చెప్పొచ్చు. సెన్సేష‌న‌ల్ మాస్ ట్రాక్ కుర్చీ మడతపెట్టి అన్ని భాషల సంగీత ప్రియులను ఆకట్టుకుని ఆరు నెలలకు పైగా గడిచింది. గుంటూరు కారం చిత్రానికి రొటీన్ పాట‌లు ఇచ్చిన‌ థమన్ కంపోజ్ చేసిన ఈ పాట మాస్ ఆద‌ర‌ణ‌తో రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ ని, లైక్ ల‌ను సాధిస్తోంది.

ఈ వీడియో సాంగ్ దాదాపు 300 మిలియన్ల వీక్షణలను 2 మిలియన్లకు పైగా లైక్‌లను సంపాదించింది. నిజానికి ఇది టాలీవుడ్‌లో అసాధారణమైన ఫీట్. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఈ పాట విజయాన్ని మళ్లీ మళ్లీ ఆస్వాధిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఘ‌ట్ట‌మ‌నేని మాస్ ఫ్యాన్స్ కి ఈ పాట ఎంత‌గా కిక్కిచ్చిందో చెప్పేందుకు ఈ క్లిక్ లు.. లైక్ లు ప‌రిశీలిస్తే చాలు.

ప్రారంభంలో ఈ పాట ఆన్‌లైన్‌లో విడుద‌లైన‌ప్పుడు చాలా మంది థ‌మ‌న్ పనితీరు అంత గొప్ప‌గా లేద‌ని విమ‌ర్శించారు. అయినప్పటికీ దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. అప్పటి నుండి అనేక రికార్డులను బద్దలు కొట్టింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'గుంటూరు కారం' సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించింది. ఈ బ్యూటీ ఎన‌ర్జిటిక్ డ్యాన్సుల వ‌ల్ల కూడా కుర్చీ మ‌డ‌త‌పెట్టి పాట చార్ట్ బ‌స్ట‌ర్ల‌లో నిలిచింది. ఇప్పుడు ఇన్నివిధాలుగా రికార్డుల‌కు కార‌ణ‌మైంది. కార‌ణం ఏదైనా కానీ, 'గుంటూరు కారం' కూడా మ‌రో 'యానిమ‌ల్'లా నిరంత‌రం చ‌ర్చ‌ల్లో నిలుస్తోంది.