Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ సినిమాలో నటించకుండా ఉండాల్సింది : ఖుష్బు

స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుసగా సినిమాలు ఖుష్బూ సినిమాకి సైతం ఒక సినిమాలో చేయకుండా ఉంటే బాగుండేది అనుకుందట.

By:  Tupaki Desk   |   4 Dec 2024 11:30 AM GMT
సూపర్‌ స్టార్‌ సినిమాలో నటించకుండా ఉండాల్సింది : ఖుష్బు
X

నటీనటులు తమ సినీ కెరీర్‌లో కొన్ని పాత్రలు చేయడం ద్వారా ఎంతో గుర్తింపు దక్కించుకుంటారు, కొన్ని పాత్రలు చేయడం ద్వారా విమర్శలు పొందుతారు. వారికి వ్యక్తిగతంగా కొన్ని సినిమాలు తాము ఆ సినిమాలో నటించకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సినిమా విషయంలో, ఏదో ఒక పాత్ర విషయంలో అలాంటి ఫీలింగ్‌ ఉంటుంది. స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలిగి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుసగా సినిమాలు ఖుష్బూ సినిమాకి సైతం ఒక సినిమాలో చేయకుండా ఉంటే బాగుండేది అనుకుందట. అది సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమా కావడం విశేషం.

ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రజనీకాంత్‌ అన్నాత్తే సినిమా గురించి దర్శకుడు నాకు చెప్పిన సమయంలో కథ ఒకలా ఉంటే, తీసిన తర్వాత మరోలా అయ్యింది. కథ నాకు చెప్పిన విధానం నచ్చింది. ఆ కథ, పాత్ర నచ్చడంతో సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాను. కానీ తీరా సినిమా ప్రారంభం తర్వాత మొత్తం మారిపోయింది. తాను షూటింగ్‌ సమయంలోనే అడిగినా తప్పని పరిస్థితుల్లో కాస్త స్క్రిప్ట్‌ మార్చినట్లుగా అన్నారు. అయినా సరే అని సినిమాలో నటించాను. నాకు పాత్ర గురించి చెప్పిన సమయంలో మీనాను రజనీకాంత్‌కి జోడీగా నటింపజేయడం లేదని చెప్పారు.

సినిమాలో మీనా పాత్ర కీలకంగా ఉంటుందని నేను అనుకున్నాను. రజనీ సర్‌తో ఈ సినిమాలో నాకు పెయిర్‌ లేదని మొదట దర్శకుడు చెప్పారు. అందుకే నేను ఒప్పుకున్నాను. కానీ షూటింగ్‌ ప్రారంభం అయిన తర్వాత చాలా మారింది. ఆ విషయంలో నేను చాలా అసంతృప్తి వ్యక్తం చేశాను. సినిమా ఫస్ట్‌ హాఫ్‌లో కొన్ని సీన్స్‌ లో కనిపించిన తాను సెకండ్‌ హాఫ్‌లో పెద్దగా కనిపించలేదు. దాంతో నాకు సినిమాలో నటించడంపైనే ఆసక్తి లేకుండా పోయింది. అయినా సినిమాలో నటించాల్సిన అవసరం వచ్చింది అంటూ ఖుష్బు చెప్పుకొచ్చింది.

ఖుష్బూ ఈమధ్య కాలంలో నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరిచాయి. అయినా అన్నాత్తే సినిమాలో నటించడం పట్ల మాత్రమే ఆమెకు అసంతృప్తి ఉంది. ఆమె కథ విన్నప్పుడు, షూటింగ్‌ చేసినప్పుడు, సినిమా విడుదల అయినప్పుడు పూర్తిగా విభిన్నంగా ఉండటం వల్లే అన్నాత్తే సినిమాపై ఆమెకు అంత అనాసక్తి ఉంది అనే అభిప్రాయంను తమిళ మీడియా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్‌ సినిమా అయినా అన్నాత్తే సినిమాలో నటించకుండా ఉండాల్సిందని ఖుష్బూ అనుకుంటూ ఉంటే, రజనీకాంత్‌ ఫ్యాన్స్ సైతం అన్నాత్తే సినిమాను సూపర్‌ స్టార్‌ చేయకుండా ఉంటే బాగుండేది అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. కనుక ఖుష్బును వారు పెద్దగా విమర్శించే అవకాశం లేదు.