Begin typing your search above and press return to search.

సమంత లైఫ్ ఆధారంగా ఖుషీ..? నిజమెంత?

దీంతో సమంత కథే అని చాలా మంది కన్ఫ్మామ్ అయిపోయారు. అయితే, అందులో నిజం లేదని నిర్మాత శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   29 Aug 2023 12:37 PM GMT
సమంత లైఫ్ ఆధారంగా ఖుషీ..? నిజమెంత?
X

సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ఖుషీ. ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి ఇది ఒక ప్రేమ కథ అనే విషయం అందరికీ తెలుసు. అయితే, ఎప్పుడైతే ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారో, అప్పుడు మూవీ కథపై ఓ క్లారిటీ వచ్చేసింది. నిజానికి , మొదట ఈ మూవీని శివ నిర్వాణ సమంత, నాగ చైతన్య తీయాలని అనుకున్నారు. అయితే, వారు విడాకులు తీసుకోవడంతో కథలోకి విజయ్ దేవరకొండ వచ్చారు.

అయితే, ఈ మూవీ అసలు కథ సమంత నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించారు అనే ప్రచారం జరుగుతోంది. సమంత, నాగ చైతన్య ప్రేమ, పెళ్లి తర్వాత విడాకులు తీసుకున్నారనే విషయం తెలిసిందే. ఇంచుమించు మూవీ కథ కూడా ట్రైలర్ చూడగానే అదే భావన కలిగింది. దీంతో సమంత కథే అని చాలా మంది కన్ఫ్మామ్ అయిపోయారు. అయితే, అందులో నిజం లేదని శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు.

తాను మూడేళ్ల క్రితమే ఈ సినిమా కథ రాసుకున్నాను అని ఆయన అన్నారు. తనకు సమంతతో మజిలీ మూవీ నుంచి మంచి అనుబంధం ఉందన్నారు. ఈ మూవీకి సమంత అయితే బాగుంటుందని ఆమెను తీసుకున్నట్లు చెప్పారు. ఇక, సమంత వ్యాధి గురించి కూడా ఆయన మాట్లాడారు. సమంతకు మైయోసైటిస్ వచ్చినప్పుడు వెంటనే నయం అయిపోతుందని, కేవలం రెండు, మూడు రోజుల్లో మళ్లీ షూటింగ్స్ లో జాయిన్ అవుతుందని అనుకున్నానని చెప్పారు. అయితే, అన్ని నెలలు పడుతుందని సమంతకు కూడా తెలియదని, కానీ,దానిని ఎదుర్కొన్న శక్తివంతమైన మహిళ అని పేర్కొన్నారు.

ఇక, ఈ సినిమాలో లవ్ స్టోరీ చాలా బాగుంటుందని, పెళ్లి తర్వాత వచ్చే సీన్లు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయని ఆయన చెప్పారు. ఇక, ఈ మూవీలో బలమైన అండర్ కరెంట్ ఎమోషన్ ఉంటుందన్నారు. మొదట ఈ మూవీకి శారద అనే పేరు పెట్టాలని అనుకున్నామని, అయితే, అన్ని భాషల్లోనూ ఒకే పేరు అయితే బాగుంటుందని ఖుషీ అని పెట్టామని చెప్పారు.

ఇక, ఈ మూవీకి సంగీతం విషయంలో తాను కొన్ని లిరిక్స్ అందించానని చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రీమియర్స్ అమెరికాలో ఆగస్టు31 వ తేదీన ప్రదర్శించనున్నారు. మరి, ఈ మూవీ ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.