Begin typing your search above and press return to search.

ఖుషి బాక్సాఫీస్.. మండే దెబ్బ పడింది!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈసారి ఎలాగైనా ఖుషి సినిమాతో మళ్ళీ తన మార్కెట్ను వెనక్కి వచ్చేలా చేసుకోవాలని అనుకున్నాడు

By:  Tupaki Desk   |   5 Sep 2023 7:19 AM GMT
ఖుషి బాక్సాఫీస్.. మండే దెబ్బ పడింది!
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈసారి ఎలాగైనా ఖుషి సినిమాతో మళ్ళీ తన మార్కెట్ను వెనక్కి వచ్చేలా చేసుకోవాలని అనుకున్నాడు. అయితే ఈ సినిమా డిమాండ్ కు తగ్గట్టుగానే మార్కెట్లో థియేట్రికల్ గా బెస్ట్ బిజినెస్ అయితే చేసింది. చివరగా లైగర్ సినిమాతో ఊహించని స్థాయిలో డిజాస్టర్ ఎదుర్కొన్నప్పటికీ కూడా విజయ్ దేవరకొండకు ఖుషి సినిమా అయితే థియేట్రికల్ మార్కెట్లో పెద్దగా ప్రభావం అయితే చూపించలేకపోయింది.

అయితే ఖుషి సినిమా మొదటి వీకెండ్ లో ఓపెనింగ్స్ బాగానే అందుకుంది. కానీ ఈ సినిమా సోమవారం రోజు అసలైన పరీక్ష ఎదుర్కొంది. సినిమాకు టాక్ కొంత అటు ఇటుగా వచ్చిన విషయం తెలిసిందే. సినిమా పరవాలేదు కానీ ఎక్కడో ఏదో మిస్సయింది అని రొటీన్ రెగ్యులర్ సినిమాను చూసినట్లుగా ఉంది అంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ అయితే వినిపించాయి.

అయితే ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి మూడు రోజుల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజు 9 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ అందుకున్న ఖుషి సినిమా ఆ తర్వాత రెండవ రోజు 5.36 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ దక్కించుకుంది. ఇక మూడవరోజు కూడా దాదాపు అదే తరహాలోనే కలెక్షన్స్ రాగా నాలుగో రోజు సోమవారం కావడంతో ఒక్కసారిగా నెంబర్లు తగ్గిపోయాయి.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 4వ రోజు ఈ సినిమాకు కేవలం కోటి రూపాయల షేర్ మాత్రమే దక్కింది. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తంగా 4 రోజుల్లో వచ్చిన షేర్ కలక్షన్స్ 21.96 కోట్లు, 36.20 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఏరియాల వారిగా చూసుకుంటే ఈ సినిమా ఇప్పటివరకు నాలుగు రోజుల్లో నైజాం ఏరియాలో 11.86 కోట్లు రెండు కోర్లు, ఉత్తరాంధ్రలో 2.57 కోట్లు దక్కించుకుంది.

మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి ఇప్పటివరకు ఈ సినిమాకు 21.96 కోట్లు షేర్ కలెక్షన్స్, 36.20 కోట్లు గ్రాస్ దక్కింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే అటువైపు నుంచి 2.70 కోట్లు రాగా మిగతా భాషల్లో 2.40 కోట్లు దక్కింది. ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమా పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకువచ్చింది. అక్కడ దాదాపు 7.80 కోట్ల షేర్ దక్కింది.

ఈ సినిమా మార్కెట్లో థియేట్రికల్ గా 52 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేయగా 53 కోట్ల టార్గెట్ ఫిక్స్ అయింది. ఇక నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 34.86 కోట్లు షేర్ రాబట్టింది. అంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా 18 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రావాల్సి ఉంది. నైజాం అలాగే ఓవర్సీస్ లో ఈ సినిమా పెద్దగా నష్టాలను కలిగించే అవకాశం అయితే లేదు. కానీ సీడెడ్ ఆంద్ర లో మాత్రం కాస్త ఎక్కువ స్థాయిలోనే నష్టాలు కలిగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.