Begin typing your search above and press return to search.

విజయ్ ఒడిలో సమంత.. ఎంత క్యూట్ గా ఉన్నారో..!

విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   7 Aug 2023 9:32 AM GMT
విజయ్ ఒడిలో సమంత.. ఎంత క్యూట్ గా ఉన్నారో..!
X

విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత వీరిద్దరూ మంచి కంప్లీట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. సమంతకు శాకుంతంల, విజయ్ కి లైగర్ ప్లాప్ రావడంతో, వీరిద్దరికీ ప్రస్తుతం ఈ హిట్ చాలా అవసరం. వీరు కూడా ఈ మూవీని చాలా ఇష్టంగా పూర్తి చేశారు. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 1వ తేదీన ఈ ప్రేమ కథ ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ క్రమంలో, ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తారా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై తాజాగా మూవీ టీమ్ ఓ ప్రకటన చేస్తూ, పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ సమంత, విజయ్ దేవర కొండ పెయిర్ చాలా క్యూట్ గా ఉంది. విజయ్ దేవర కొండ ఒడిలో సమంత కూర్చొని ఉంది. విజయ్ స్మోక్ చేస్తుంటే, సమంత కాఫీ తాగుతున్నట్లుగా ఉంది.

పెళ్లైన కొత్తలో దంపతులు రొమాంటిక్ గా ఉన్నట్లు ఈ పోస్టర్ లో చూపించారు. వీరిద్దరి జంట స్క్రీన్ పై చూడటానికి చాలా బాగుంది. ఇక, ట్రైలర్ రిలీజ్ డేట్ ని కూడా కన్ఫామ్ చేశారు. ఆగస్టు 9వ తేదీన మూవీ ట్రైలర్ విడుదల చేయనున్నారు. కాగా, ఇప్పటికే ఈ మూవీ నుంచి మూడు పాటలు విడుదల చేశారు.

ఆ మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్ ఆల్రెడీ హిట్ అయ్యింది. ఇక సినిమా ఎంత వరకు క్లిక్ అవుతుందో చూడాలి. ఈ మూవీ కి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన నిన్నుకోరి, మజిలీ వంటి సినిమాలతో బ్లక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. ఈ సినిమా కూడా హిట్ అయితే, ఆయన హ్యాట్రిక్ సాధించినట్లే.

ఈ ఖుషీ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఖుషీ మూవీ రాబోతోంది. ఖుషీ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంతతోపాటు జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు. చికిత్స నిమిత్తం మూవీలకు బ్రేక్ తీసుకున్న సమంత, ఈ మూవీ ప్రమోషన్స్ లో మాత్రం పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది.