Begin typing your search above and press return to search.

ఎర్ర కోకలో బజ్జీల పాప.. ఒక్కో సెల్ఫీ అదుర్స్ అంతే!

పబ్ కు వెళ్లింది.. డ్రగ్స్ తీసుకోవడానికి కాదు.. చీజ్ బజ్జీలు తినడానికి అని చెప్పింది.

By:  Tupaki Desk   |   6 Sep 2024 4:30 PM GMT
ఎర్ర కోకలో బజ్జీల పాప.. ఒక్కో సెల్ఫీ అదుర్స్ అంతే!
X

బజ్జీల పాప.. అదేనండీ తెలుగు అమ్మాయి కుషిత కల్లపు.. సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న అమ్మడు.. ఆ క్రేజ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన కుషిత.. ఒక్క డ్రగ్స్ కేసుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయిపోయింది. పబ్ కు వెళ్లింది.. డ్రగ్స్ తీసుకోవడానికి కాదు.. చీజ్ బజ్జీలు తినడానికి అని చెప్పింది. దీంతో బజ్జీల పాపగా ఆమె పేరు మారింది!


ఆ తర్వాత ఇన్ స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ గా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. అనేక షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. చాంగురే బంగారు రాజా, మనోహరం సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. గత ఏడాది నీతోనే నేను, అడ్డతీగల చిత్రాల్లో నటించింది. పెళ్లి కూతురు పార్టీ సినిమాలో మెరిసింది. రీసెంట్ గా బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ తో కలిసి బాబు నెంబర్ 1 బుల్ షిట్ గాయ్ సినిమా చేసింది. కానీ అనుకున్న స్థాయిలో హిట్స్ సాధించలేకపోయింది.


అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీలో నటించే ఛాన్స్ అందుకుంది కుషిత. నాలుగు రోజులపాటు షూట్ కు వెళ్లింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆమె కనిపించలేదు. ఈ విషయంపై ఆమెనే తర్వాత క్లారిటీ ఇచ్చింది. తాను చేసిన సీన్స్ ఎడిటింగ్ లో తొలగించినట్లు తెలుసుకున్నానని తెలిపింది. కాస్త బాధపడినా.. ఇలాంటివి కామన్ కదా అని చెప్పింది. ఇప్పుడు మంచి సినిమా అవకాశాలు అందుకోవాలని చూస్తోంది.


అదే సమయంలో నెట్టింట తన అందచందాలతో ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు చీరల్లో అందాలు ఆరబోస్తూ ఫిదా చేస్తుంటుంది. ప్లెయిన్ కలర్ శారీల్లో క్యూట్ గా కనిపిస్తూ ఫ్లాట్ చేస్తుంటుంది. జిమ్ చేస్తున్న పిక్స్ షేర్ చేస్తుంటుంది. మోడ్రన్ డ్రెస్సుల్లో కూడా ఫోటో షూట్ పోస్ట్ చేస్తూ మైమరపిస్తుంటుంది. అలా ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది. తాజాగా కొత్త పిక్స్ పోస్ట్ చేసింది. ట్రెడిషనల్ గా, హోమ్లీగా కుషిత కల్లపు సందడి చేసింది.


రెడ్ కలర్ శారీలో సంప్రదాయంగా రెడీ అయ్యి వరుసగా తీసుకున్న సెల్ఫీలు షేర్ చేసింది. హెవీ నెక్ సెట్ వేసుకున్న అమ్మడు.. జడకు మల్లెపూలు పెట్టుకుంది. ఒక్కో సెల్ఫీలో ఒక్కో ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఆకట్టుకుంటుంది. కొంటెగా.. ముద్దుగా.. క్యూట్ గా.. అమాయకంగా.. కామెడీగా.. కుషిత ఇచ్చిన పోజులు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. బజ్జీల పాప పిక్స్ అదిరిపోయాయని, ఫ్లాట్ అయ్యామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు