Begin typing your search above and press return to search.

గ్లామరస్ కుషిత.. చీరలో బొమ్మలా!

బజ్జీల పాపగా తెలుగు రాష్ట్రాల్లో బ్యూటీ పేరు ఆ సమయంలో మార్మోగిపోయింది.

By:  Tupaki Desk   |   18 Jun 2024 7:21 AM GMT
గ్లామరస్ కుషిత.. చీరలో బొమ్మలా!
X

తెలుగమ్మాయి కుషిత కల్లపు.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ బ్యూటీ.. డ్రగ్స్ కేసుతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. పబ్ కు డ్రగ్స్ తీసుకోవడానికి కాదు.. చీజ్ బజ్జీలు తినడానికి వచ్చామని చెప్పడంతో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. బజ్జీల పాపగా తెలుగు రాష్ట్రాల్లో బ్యూటీ పేరు ఆ సమయంలో మార్మోగిపోయింది.


ఆ మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారంలో నటించినట్లు తెలిపింది. నాలుగు రోజులపాటు షెడ్యూల్ లో కూడా పాల్గొన్నట్లు చెప్పింది. కానీ సినిమాలో కుషిత కల్లపు కనిపించలేదు. ఎడిటింగ్ లో తన సీన్స్ తీసేశారని తర్వాత తెలిపింది. సినిమాల్లో ఇలా అప్పుడప్పుడు అవుతుంటాయని అని ఫీల్ అయ్యి ఊరుకున్నట్లు చెప్పింది. ఎందుకు తీసేశారో రీజన్ మాత్రం తెలియదని అనింది.


రీసెంట్ గా బాబు నెం.1 బుల్ షిట్ గయ్ సినిమాతో కుషిత కల్లపు హీరోయిన్ గా పరిచయమైంది. ఇటీవల ఈ సినిమా థియేటర్లో విడులైంది. బిగ్‌ బాస్ అర్జున్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి లక్ష్మణ వర్మ దర్శకత్వం వహించారు. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో కుషిత తన యాక్టింగ్ తో సినీ ప్రియులను మెప్పించింది. ప్రస్తుతం తెలుగులో పలు సినిమాల్లో ఈ బ్యూటీ యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


అయితే సోషల్ మీడియాలో కుషిత గ్లామర్ షో మాములుగా ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తుంటోంది. రకరకాల ఔట్ ఫిట్స్ లో సందడి చేస్తుంటోంది. మోడ్రన్ డెస్సులతో పాటు శారీల్లో ఎక్కువగా మెరుస్తుంటోంది. చీరల్లో కుషిత వేరే లెవల్ లో ఉంటోంది. తన చీరకట్టుకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె శారీల్లో దిగిన పిక్స్.. నెట్టింట ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి చీరలో మెరిసింది బ్యూటీ.

ఎల్లో కలర్ శారీలో పిక్స్ దిగి పోస్ట్ చేసింది కుషిత కల్లపు. సింపుల్ గా లవ్ సింబల్ ను క్యాప్షన్ గా ఇచ్చింది. పిక్స్ లో తన గ్లోయింగ్ స్కిన్ తో ఫిదా చేస్తోంది. హెయిర్ లీవ్ చేసి కొంటెగా నవ్వుతూ మాయ చేస్తోంది. ప్రస్తుతం ఆమె నయా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె చేతికి ఉన్న వాచ్ స్పెషల్ గా ఉంది. ఇక కుషిత ఎవర్ గ్రీన్ బ్యూటీ అంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు. హీరోయిన్ మెటీరియల్ అని కామెంట్లు పెడుతున్నారు.