Begin typing your search above and press return to search.

ఫొటో టాక్: మస్త్ 'ఖుషీ' లో విజయ్ దేవరకొండ..!

ఈ మూవీ టైటిల్ సాంగ్ ని జులై 28వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

By:  Tupaki Desk   |   24 July 2023 12:14 PM GMT
ఫొటో టాక్: మస్త్ ఖుషీ లో విజయ్ దేవరకొండ..!
X

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం 'ఖుషీ'. ఈ మూవి ని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లడానికి మేకర్స్ మంచి ప్లానింగ్ చేస్తున్నారు. ఒక్కొక్క పాట ను విడుదల చేస్తూ, ఆసక్తి రేపుతున్నారు. దీంతో, రోజు రోజుకీ ఈ మూవీ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్‌ తో సెన్సిబుల్ మూవీ మేకర్‌ గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.


కాగా, ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు పాటలు విడుదల చేయగా, రెండూ బ్లాగా క్లిక్ అయ్యాయి. ఈ క్రమంలో మూడో పాట ను కూడా విడుదల చేయడానికి మూవీ టీమ్ రెడీ అయిపోయింది. ఈ మూవీ టైటిల్ సాంగ్ ని జులై 28వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీని ప్రకారం ఓ పోస్టర్ విడుదల చేశారు.

ఆ పోస్టర్ లో విజయ్ దేవరకొండ ఒక్కరే కనిస్తున్నారు. కానీ, మస్తు ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆనందంతో గాల్లో ఎగురుతున్నట్లుగా ఉంది ఆ ఫోటో. బ్లూకలర్ డ్రెస్ లో చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. కాగా, ఇప్పటికే విడుదలైన ఆరాధ్య సాంగ్, నా రోజా నువ్వే పాట ఈ రెండూ మంచి హిట్లు అందుకున్నాయి.ఈ రెండు పాటలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి.

ఇక, ఈ టైటిల్ సాంగ్ కూడా కచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకి హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించారు. కాగా, ఈ మూవీ సెప్టెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ మరి ఎంత ఆకట్టుకుంటుందో చూడాలి.

ఈ ఖుషీ మూవీ ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఖుషీ మూవీ రాబోతోంది. ఖుషీ సినిమా లో విజయ్ దేవరకొండ, సమంతతోపాటు జయరాం, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.