Begin typing your search above and press return to search.

ఎంపురాన్ బాక్సాఫీస్.. మోహన్‌లాల్ హ్యాట్రిక్ సెంచరీ

ఎంపురాన్ సినిమా లూసిఫర్ కి సీక్వెల్‌గా తెరకెక్కింది. పృథ్వీరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మొదటి భాగం లూసిఫర్ 2019లో విడుదలై 175 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

By:  Tupaki Desk   |   29 March 2025 5:26 AM
ఎంపురాన్ బాక్సాఫీస్.. మోహన్‌లాల్ హ్యాట్రిక్ సెంచరీ
X

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎంపురాన్ భారీ అంచనాల మధ్య విడుదలై, తొలి రెండు రోజుల్లోనే సాలీడ్ కలెక్షన్స్ రాబట్టింది. కొంతమంది విమర్శకులు చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు ఇచ్చినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం సినిమా కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే ఎంపురాన్ రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం మళయాళ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ రికార్డ్‌గా నిలిచింది. అలాగే ఇది మోహన్‌లాల్ కెరీర్‌లో 3వ 100 కోట్ల చిత్రం కావడం విశేషం.

ఎంపురాన్ సినిమా లూసిఫర్ కి సీక్వెల్‌గా తెరకెక్కింది. పృథ్వీరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మొదటి భాగం లూసిఫర్ 2019లో విడుదలై 175 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వచ్చిన ఎంపురాన్ మొదటి రోజే 53 కోట్ల గ్రాస్ రాబట్టడం ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేసింది. రెండో రోజుకి కూడా అదే జోరు కొనసాగడంతో, 2 రోజుల్లో 100 కోట్ల క్లబ్‌ను ఛేదించింది. మలయాళ సినిమాల్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం గమనార్హం.

ఇప్పటివరకు మోహన్‌లాల్‌కు 100 కోట్ల క్లబ్‌లో చేరిన రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. అవే పులిమురుగన్ , లూసిఫర్. పులిమురుగన్ 2016లో విడుదలై మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన లూసిఫర్ కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఎంపురాన్ కూడా అదే జోరులో కొనసాగుతుండటంతో, మోహన్‌లాల్‌కు ఇది హ్యాట్రిక్ 100 కోట్లు క్లబ్ హిట్ అయింది.

సినిమాలో మోహన్‌లాల్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించగా, కథలో మిస్టరీ, ఇంటెన్సిటీని సమపాళ్లలో మిక్స్ చేశారు. చిత్రాన్ని రూపొందించిన పృథ్వీరాజ్ తన డైరెక్షన్ స్టైల్‌తో మలయాళ చిత్రాలకు ఒక కొత్త ట్రెండ్ ను చూపిస్తున్నాడు. యాక్షన్ సన్నివేశాలు, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్, ఇంటెన్స్ స్కోర్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్టవ్వగా ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ ఈ సినిమా విషయంలో పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

ప్రస్తుతం ఎంపురాన్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదలై కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. ఒకవేళ ఇది వారం రోజుల జోరును కొనసాగిస్తే, మలయాళ సినిమా హిస్టరీలో ఎంపురాన్ మరో బిగ్ రికార్డ్ గా నిలవడం ఖాయం. దీంతో మోహన్‌లాల్ మాస్ ఇమేజ్ మళ్లీ శిఖరాన్ని చేరింది. ఇప్పుడు మిగతా ఇండస్ట్రీలు కూడాయూ ఈ సినిమాపై ఓ కన్నేసి చూస్తున్నాయి. మరి సినిమా ఇంకా ఎలాంటి నెంబర్లను బ్రేక్ చేస్తుందో చూడాలి.