Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్: ఇండియన్ ఇండస్ట్రీలలో ఫస్ట్ 50 కోట్లు కొట్టిన సినిమాలివే...

దక్షిణాది సినిమాల్లో మాస్ కంటెంట్ కు ఎప్పుడూ కూడా సాలీడ్ ఓపెనింగ్స్ వస్తుంటాయి. అయితే ఇందులో తమిళ తంబీలు మాత్రమే డామినేట్ చేసేవారు.

By:  Tupaki Desk   |   26 March 2025 6:16 AM
South Cinemas ₹50 Crore Opening Club Expands
X

దక్షిణాది సినిమాల్లో మాస్ కంటెంట్ కు ఎప్పుడూ కూడా సాలీడ్ ఓపెనింగ్స్ వస్తుంటాయి. అయితే ఇందులో తమిళ తంబీలు మాత్రమే డామినేట్ చేసేవారు. కానీ ఇప్పుడు వారిని దాటేసేలా మిగతా ఇండస్ట్రీలు కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ఆఖరి స్థానంలో ఉండే మలయాళం సినిమాలు కూడా ఏకంగా 50 కోట్ల క్లబ్‌కి అడుగుపెడుతున్నాయి. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కిస్తున్న 'ఎల్2ఎ: ఎంపురాన్' సినిమా ఇప్పుడే ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో ఓ ల్యాండ్‌మార్క్‌గా నిలవబోతోంది. ఫస్ట్ డే మొదటి షోకే రూ.50 కోట్లు దాటబోతున్నదంటే.. బజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు.

ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మొదటిసారి 50 కోట్ల ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల లిస్ట్ ఈ విధంగా ఉంది.

బాలీవుడ్ - చెన్నై ఎక్స్‌ప్రెస్

బాలీవుడ్ లో షారుక్ ఖాన్ నటించిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' తొలి రోజు ఓపెనింగ్ వసూళ్లు రూ.50 కోట్ల మార్క్‌ను దాటిన తొలి చిత్రం. దీని తర్వాత 'పటాన్', 'జవాన్' సినిమాలు మరింత రెకార్డులు బద్దలుకొట్టినా.. మొదట ఈ క్లబ్‌కి ద్వారం తెరిచింది చెన్నై ఎక్స్‌ప్రెస్‌నే. పెద్ద రైడ్ సినిమాగా ప్రేక్షకులను ఎగిరెగిరి గాలిలో పెట్టిన చిత్రం అది.

టాలీవుడ్ - బాహుబలి

తెలుగు ఇండస్ట్రీలో మొదటి 50 కోట్ల ఓపెనింగ్ చేసిన సినిమా 'బాహుబలి: ది కన్‌క్లూజన్'. రాజమౌళి మేకింగ్, ప్రభాస్ మేనరిజం, కట్టప్ప శపథం అన్నీ కలసి వన్‌సైడ్ క్రేజీని తెచ్చాయి. అప్పట్లో ఈ రేంజ్ కలెక్షన్లు ఓ కలలా కనిపించేవి. కానీ బాహుబలి వల్ల తెలుగు సినిమా స్థాయి మరో లెవెల్ కు వెళ్ళింది.

కోలీవుడ్ కబాలి

తమిళనాట రజినీకాంత్‌ సినిమా అంటే పండుగే. 'కబాలి' సినిమాతో ఆయన ఆ క్రేజ్‌ను మరోసారి రుజువు చేశారు. మలేసియా, సింగపూర్, ఇండోనేషియా దేశాల్లోనూ భారీ ఓపెనింగ్స్ రావడం విశేషం. ఫస్ట్ డే కబాలి రూ.50 కోట్లు దాటింది, తలైవా ఫీవర్‌తో బాక్సాఫీస్ తళతళలాడిపోయింది. కానీ ఫైనల్ రన్ లో సినిమా పెద్దగా పాజిటివ్ రిజల్ట్ అందుకోలేదు. కేవలం తైలవా క్రేజ్ వల్లే ఈ సినిమా రేంజ్ పెరిగింది.

సాండల్ వుడ్ కన్నడ – KGF 2

కన్నడ పరిశ్రమలో ఏ సినిమా 50 కోట్లను మొదటి రోజు అందుకుంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. కానీ 'కేజీఎఫ్ చాప్టర్ 2' తో యాష్ తన ప్రభావాన్ని చూపించాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం, రాకింగ్ స్టార్ యష్ నటన, అద్భుతమైన విజువల్స్ సినిమాని దేశవ్యాప్తంగా బిగ్ హిట్ గా నిలబెట్టాయి.

మాలివుడ్ – L2E: ఎంపురాన్

ఇక ఇప్పుడు మలయాళ సినిమాలకి ఇది గోల్డెన్ మూమెంట్. మోహన్ లాల్ – పృథ్వీరాజ్ కలయికలో వస్తున్న ‘ఎల్2ఎ: ఎంపురాన్’ టీజర్ నుంచే ఓ ఇంటెన్స్ హైప్ క్రియేట్ చేసింది. పొలిటికల్ థ్రిల్లర్ బేస్‌తో, ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ట్రైలర్, పోస్టర్లు ఉండడంతో, బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 20 కోట్ల మార్క్ దాటింది. ఇప్పుడు వర్క్‌డే అయినా, ఫస్ట్ షో ముందే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లు అందుకునే స్థాయిలో బజ్ ఏర్పడింది. ఇది కేవలం మలయాళం మాత్రమే కాదు, మొత్తం ఇండియన్ సినిమాకు ఒక కొత్త ట్రెండ్ ను తాకే ప్రయత్నంగా మారింది.