Begin typing your search above and press return to search.

ఆస్కార్స్ 2024: 'లాప‌టా లేడీస్' ఎంపిక‌ వెన‌క లిటిగేష‌న్?

అకాడమీ అవార్డుల కోసం భారతదేశ అధికారిక ఎంట్రీగా కిరణ్ రావు `లాపాటా లేడీస్‌`ను ఎంపిక చేయడం స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది.

By:  Tupaki Desk   |   27 Sep 2024 4:29 PM GMT
ఆస్కార్స్ 2024: లాప‌టా లేడీస్ ఎంపిక‌ వెన‌క లిటిగేష‌న్?
X

అకాడమీ అవార్డుల కోసం భారతదేశ అధికారిక ఎంట్రీగా కిరణ్ రావు `లాపాటా లేడీస్‌`ను ఎంపిక చేయడం స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎఫ్ఐ) తప్పు చేసింద‌నే కోణంలో క్రిటిక్స్ లో చర్చ కొనసాగుతోంది. ఆస్కార్-విజేత, ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌ నిర్మాత గునీత్ మోంగా ఇప్పుడు లాప‌టా లేడీస్ ఎంపిక వెన‌క అస‌లు లాజిక్ ని బ‌హిరంగంగా చ‌ర్చించారు.

ఆస్కార్ పుర‌స్కారాలు ఇచ్చేది అమెరిక‌న్లు కాబ‌ట్టి, మ‌నం అమెరికాలో పంపిణీ చేసే భార‌తీయ సినిమాను మాత్ర‌మే ఆస్కార్ ల‌కు పంపాల‌ని గునీత్ మోంగా అన్నారు. అమీర్ ఖాన్ మాజీ భార్య కిర‌ణ్ రావు తెర‌కెక్కించిన లాపటా లేడీస్ ని అమెరికాలో ప్ర‌ముఖ పంపిణీ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంద‌ని, అందువ‌ల్ల‌నే ఆస్కార్ రేసుకు ఎంపిక చేసార‌ని కూడా అన్నారు. అంతేకాదు.. ఈ పంపిణీ వ్య‌వ‌స్థ‌కు అన్నీ తెలుసు. ఆస్కార్ రేసులో పోటీప‌డాలంటే ధ‌న‌బ‌ల స‌మీక‌ర‌ణ‌, ప్ర‌చార మార్గాలు తెలియాల‌ని, దీనికి ఈ వ్య‌వ‌స్థ స‌హ‌క‌రిస్తుంద‌ని, ఇలాంటి వాటిపై తాను చాలా ప‌రిశోధించాన‌ని కూడా గునీత్ అన్నారు.

అమెరికాలో పంపిణీ చేసిన‌ చిత్రాలను మాత్రమే ఎంట్రీలుగా పంపడం ముఖ్యం అని గునీత్ కొంత సూచించారు. నిజానికి గునీత్ మోంగా తెర‌కెక్కించిన `ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్‌` కూడా ఆస్కార్ నామినేష‌న్ల రేసులో ఉంది. కానీ దీనికి పోటీగా వ‌చ్చింది లాప‌తా లేడీస్. చివ‌రికి దానిని ఆస్కార్ నామినేష‌న్ల‌కు ఎంపిక చేసారు.

గునీత్ మోంగా సినిమా ఇప్ప‌టికే అంతర్జాతీయ సినిమా ఉత్స‌వాల్లో స‌త్తా చాటింది. అయినా దానిని ఎంపిక చేయ‌లేదు. ఎఫ్‌.ఎఫ్‌.ఐ. కొన్ని ద‌శాబ్ధాల కాలంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అధికారిక పోటీ విభాగంలో ఎంపికైన మొదటి భారతీయ చిత్రంగా `ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్` నిలిచింది. ఇది ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రిక్స్ అవార్డులను గెలుచుకుంది. ఇది ఫ్రాన్స్ పుర‌స్కారాల్లో షార్ట్‌లిస్ట్ అయింది. కానీ ఇక్క‌డ గుర్తింపు ద‌క్క‌లేదు.

తాజా ఇంటర్వ్యూలో గునీత్ మాట్లాడుతూ-``FFI చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే.. నామినేషన్ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్న ఒక సినిమాను ఎంపిక చేయ‌డానికి భిన్నంగా.. చాలా ఉత్తమమైన చిత్రం అని వారు భావించేదాన్ని ఎంచుకుంటారు. 2001లో లగాన్ తర్వాత ఆస్కార్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరీలో ఏ భారతీయ చిత్రం నామినేట్ కాలేదు. ఆ సినిమా స్టార్ అమీర్ ఖాన్ `లాపటా లేడీస్‌`కి నిర్మాతగా ఉన్నారు. అమీర్ కి ఆస్కార్ ప్రచారాన్ని ప్రారంభించిన అనుభవం ఉంది. అయితే లాపటా లేడీస్ చిత్రానికి అంత సినిమా లేదు. ఒక అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ దానిని అమెరికాలో పంపిణీ చేస్తున్నారు. జానస్ ఫిల్మ్స్ ద్వారా USలో పంపిణీ చేస్తున్నారు. పటిష్టమైన అమెరికన్ పంపిణీదారుడితో సంబంధాలు ఉంటే అక్కడ మ‌న‌ ప్రయాణం సులభం అవుతుంది. డ‌బ్బు ఖ‌ర్చు చేసి ప్ర‌చార‌క‌ర్త‌ల‌ను మ‌నం ఏర్పాటు చేసుకోగ‌లం. గ‌తంలో ఆస్కార్ అందుకున్న‌ `ఎలిఫెంట్ విష్పరర్స్` కోసం కూడా నేను అక్కడ ఒక నెలకు పైగా ఉన్నాను. వారు అక్కడ నిర్మించిన పెద్ద వ్యవస్థను చూసి నేను విస్మయం చెందాను. ఆస్కార్ గెలుచుకోవ‌డం కోసం డబ్బు, సమయం, శక్తిని వారి అందిస్తారు అని గునీత్ అన్నారు.

నామినేషన్ సాధించిన చివరి భారతీయ చిత్రం లగాన్ ని సోనీ పిక్చర్స్ క్లాసిక్స్ పంపిణీ చేసింది. ప్రతి వ్యక్తికి మరియు ప్రతి జర్నలిస్ట్‌కు నేను చెప్పాలనుకుంటున్నాను. దయచేసి యుఎస్ డిస్ట్రిబ్యూటర్‌లు ఉన్న చిత్రాలను ఆస్కార్స్ కి పంపండి.. అని అన్నారు. వారికి అక్క‌డ‌ మెకానిజం ఉంది.. వారికి పని తెలుసు. గెలవడం అనేది కల కాదు. షార్ట్‌లిస్ట్ నుండి నామినేషన్‌కి వెళ్లడం ఆస్కార్‌లలో చాలా కష్టతరమైన భాగం. అయితే దానికోసం మ‌నం చేయవలసిన పని వేరే ఉంది అని అర్థం చేసుకోండి. ఇక్కడి కమిటీ వారు అవార్డు ఇస్తున్నట్లుగా మన ఉత్తమ చిత్రాన్ని పంపాలని నిరంతరం భావిస్తారు. కానీ మీరు అమెరికన్ డిస్ట్రిబ్యూషన్ ఉన్న సినిమాని పంపాలి. ఎందుకంటే ఇది అమెరికన్ అవార్డు.. అని గునీత్ అన్నారు.

గునీత్‌కు ఆస్కార్ ప్రచార కార్యక్రమాలలో ఒక దశాబ్దానికి పైగా అనుభవం ఉంది. ఆమె ప్రయత్నాలు కొన్ని సంవత్సరాల క్రితం ఫలించాయి. ఆమె డాక్యుమెంటరీ షార్ట్ `ఎలిఫెంట్ విస్పరర్స్‌` ఆస్కార్‌ను గెలుచుకుంది. అదే సంవత్సరంలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో RRR చిత్రం పుర‌స్కారం గెలుపొందింది.