Begin typing your search above and press return to search.

2025 లో స్టార్ భామ‌లంతా సోలోగా స‌త్తా చాటేలా!

కొత్త ఏడాదిలో స్టార్ హీరోయిన్లు అంతా కొంగొత్త‌గా అల‌రించ‌డానికి రెడీ అవుతున్నారు. బాక్సాఫీస్ వ‌ద్ద సోలోగా స‌త్తా చాట‌డానికి మేము సైతం అంటూ దూసుకొస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 Dec 2024 5:30 PM GMT
2025 లో స్టార్ భామ‌లంతా సోలోగా స‌త్తా చాటేలా!
X

కొత్త ఏడాదిలో స్టార్ హీరోయిన్లు అంతా కొంగొత్త‌గా అల‌రించ‌డానికి రెడీ అవుతున్నారు. బాక్సాఫీస్ వ‌ద్ద సోలోగా స‌త్తా చాట‌డానికి మేము సైతం అంటూ దూసుకొస్తున్నారు. న‌టిగా త‌మ‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నా భామ‌లంతా మ‌రో ఎక్క‌డానికి సింసిద్ద‌మ‌య్యారు. ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే... నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా ఇప్ప‌టికే పాన్ ఇండియాలో ఓ సంచ‌ల‌నంగా మారింది. ర‌ష్మిక ఏ సినిమా చేస్తున్నా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్ ఉంది.

ర‌ష్మిక కోస‌మే సినిమాకొచ్చే అభిమానులెంతో మంది. ఈనేప‌థ్యంలో అమ్మ‌డు సోలోగా రెడీ అవుతోంది. ప్ర‌స్తుతం యువ ద‌ర్శ‌కుడు రాహుల్ ర‌వీంద్ర ద‌ర్శ‌క‌త్వంలో `ది గ‌ర్ల్ ప్రెండ్` అనే సినిమా తెలుగు, హిందీ భాష‌ల్లో చేస్తుంది. ఇప్ప‌టికే సినిమా షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ సినిమా వ‌చ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. రిలీజ్ తేదీ ప్ర‌క‌టించాల్సి ఉంది. అలాగే మ‌ల‌యాళం బ్యూటీ సంయుక్తా మీన‌న్ కూడా లేడీ ఓరియేటెండ్ చిత్రాల ట‌ర్నింగ్ తీసుకుంది.

యేగేష్ అనే కొత్త కుర్రాడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు అగ్రిమెంట్ చేసుకుంది. ప్ర‌స్తుతం సంయుక్త వివిధ ప్రాజెక్ట్ ల్లో బిజీగా ఉంది. వాటిని పూర్తి చేసి వ‌చ్చే ఏడాది ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేసుకుంటుంది. బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే కూడా సింగిల్ గా నేను సైతం అంటోంది. త‌మిళ్ డైరెక్ట‌ర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తుతో ఉమెన్ సెంట్రిక్ చిత్రానికి ఒప్పందం చేసుకుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డు స్టార్ హీరోల చిత్రాల‌తో బిజీగా ఉంది. వ‌చ్చే ఏడాది ఆ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు. ఇక మెగా కోడ‌లు లావ‌ణ్య త్రిపాఠి ఇప్ప‌టికే సోలో ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది.

కానీ స‌క్సెస్ అనుకున్న స్థాయిలో రాలేదు. మెగా ఇంట కోడ‌లైన నేప‌థ్యంలో ఇప్పుడా క్రేజ్ ని ఎన్ క్యాష్ చేసుకుంటుంది. `స‌తీ లీలావ‌తి` అనే చిత్రాన్ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంది. స్వీటీ అనుష్క ఇప్ప‌టికే `అరుంధ‌తి`,` భాగ‌మ‌తి` తో స‌త్తా చాటింది. కానీ ఆ త‌ర్వాత చేసిన ప్ర‌య‌త్నాలు పెద్ద‌గా క‌లిసి రాలేదు. ప్ర‌స్తుతం య‌ధార్ధ సంఘ‌ట‌న ఆధారంగా క్రిష్ తెర‌కెక్కిస్తోన్న `ఘాటి`లో న‌టిస్తుంది. ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాల‌న్ని 2025లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.