అన్ ప్రొఫెషనల్ నోర్మూసుకో.. నటుడిపై లేడీ నిర్మాత ఫైర్
కానీ ఈ సీరియల్ అందుకు భిన్నంగా ఘాటైన ముద్దు సన్నివేశంతో 'ఏ-రేటెడ్' అన్న చర్చ సాగింది.
By: Tupaki Desk | 10 Jan 2025 3:41 AM GMTబుల్లితెరపై టీవీ షోలు, సీరియళ్లు క్లీన్ ఇమేజ్ తో ఫ్యామిలీ ఆడియెన్ ని ఆకర్షిస్తుంటాయి. కానీ ఈ సీరియల్ అందుకు భిన్నంగా ఘాటైన ముద్దు సన్నివేశంతో 'ఏ-రేటెడ్' అన్న చర్చ సాగింది. సకుటుంబ సమేతంగా టీవీ చానెల్ వీక్షిస్తున్నప్రజలు స్టన్నయిపోయే ముద్దు సన్నివేశాన్ని సీరియల్ కోసం తెరకెక్కించడంపై నెటిజనులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. అది ఏ సీరియల్? నటీనటులు ఎవరు? నిర్మాత ఎవరు? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
'బడే అచ్చే లగ్తే హై' సోనీ టీవీలో ప్రసారం అవుతున్న అందమైన కుటుంబ డ్రామా. ఇద్దరు పరిణతి చెందిన అడల్ట్ మధ్య సంబంధం గురించి చూపించారు. ఆ ఇద్దరి విరుద్ధమైన వ్యక్తిత్వాల కారణంగా పెళ్లి తర్వాత కొన్ని సంవత్సరాలకు ప్రేమలో పడతారు. ఈ సిరీస్ సోనీ టీవీలో పెద్ద హిట్ అయింది. అయితే సిరీస్ లో ప్రధాన పాత్రధారులైన రామ్ (రామ్ కపూర్)- ప్రియ (సాక్షి తన్వర్) మధ్య ఘాటైన రొమాంటిక్ సన్నివేశం అందరి దృష్టిని ఆకర్షించింది.
బడే అచ్ఛే లగ్తే హై సిరీస్ లో 12 మార్చి 2012న ప్రసారం అయింది. ఇందులో ప్రధాన జంట రామ్ - ప్రియ పెళ్లి, ఐకానిక్ జోధా అక్బర్ పాట, ముద్దు సన్నివేశం వగైరా త్వరగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ముద్దు సన్నివేశం యూట్యూబ్‌లో లక్షలాది వీక్షణలను సంపాదించింది. సోషల్ మీడియాలో ఇది వేగంగా వైరల్ అయింది. ఇది షో రేటింగ్‌లపై కూడా తీవ్ర ప్రభావం చూపింది.
ఒక అవార్డుల కార్యక్రమంలో ఏక్తా కపూర్‌ను ఈ సన్నివేశం గురించి ప్రశ్నించగా ..ప్రజలు దీన్ని చాలా ఇష్టపడ్డారని నేను అనుకుంటున్నాను. ఇష్టపడని వారికి నా క్షమాపణలు! అని వ్యాఖ్యానించారు. ఎపిసోడ్ తర్వాత షో రేటింగ్స్ తగ్గినా కానీ, అదే రాత్రి డిజిటల్ వ్యూస్ పెరిగాయని, ఎపిసోడ్ కి ఆన్‌లైన్‌లో 10 లక్షల వ్యూస్ వచ్చాయని ఏక్తా వెల్లడించారు. అయితే ముద్దు సన్నివేశంలో నటించిన రామ్ కపూర్ ఇటీవల యూట్యూబర్ సిద్ధార్థ్ కన్నన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో `బడే అచ్చే లగ్తే హైన్`లో తనకు సాక్షి తన్వర్‌కు మధ్య ముద్దు సన్నివేశం గురించి మాట్లాడారు. దీనికి కొంతమంది ప్రేక్షకుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆ సన్నివేశం గురించి తాను ఏక్తాకు అభ్యంతరాలు వ్యక్తం చేశానని, అయితే దానిని ఎలాగైనా కొనసాగించాలని నిర్ణయించారని రామ్ వెల్లడించాడు.
దీనిపై వెంటనే ఏక్తా కపూర్ తన ఇన్‌స్టా స్టోరీలో క్రిప్టిక్ పోస్ట్‌ను షేర్ చేసారు. నా షోల గురించి ఇంటర్వ్యూలు ఇచ్చే ప్రొఫెషనల్ కాని నటులు నోరు మూసుకోవాలి! ఇదంతా తప్పుడు సమాచారం .. వక్రీకరించిన కథనాలు.. అని ఏక్తా సీరియస్ అయ్యారు. బడే అచ్చే లగ్తే హైన్ సోనీ టీవీ ప్రైమ్‌టైమ్ స్లాట్‌లో రాత్రి 8.30 గంటలకు తిరిగి ప్రసారం అవుతుంది.