పిక్ టాక్ : లేడీ సూపర్ స్టార్ కొత్త జర్నీ
అలాంటి ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న నయన్ కొత్త జర్నీ మొదలు పెట్టబోతుందా అంటే ఔను అనే సమాధానం ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది.
By: Tupaki Desk | 25 Nov 2023 9:28 AM GMTసౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా ఇతర ఏ హీరోయిన్ కూడా దక్కించుకోలేని అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. అంతే కాకుండా సౌత్ కి చెందిన ఏ హీరోయిన్ కూడా పొందలేని పారితోషికం ను కూడా తీసుకుంది అంటూ ఆమె అభిమానులు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న నయన్ కొత్త జర్నీ మొదలు పెట్టబోతుందా అంటే ఔను అనే సమాధానం ఈ ఫోటో చెప్పకనే చెబుతోంది.
ఈ ఫోటోను స్వయంగా నయనతార సోషల్ మీడియా హ్యాండిల్ పై జనాలు చూడవచ్చు. కొత్తగా ప్రారంభిస్తున్నాను అంటూ ఈ ఫోటోకు కామెంట్ పెట్టి నయన్ పోస్ట్ చేయడంతో చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కెమెరా ముందు ఇన్నాళ్లు నటించిన నయనతార ఇప్పుడు కెమెరా వెనుక నిలవబోతోంది అని ఈ ఫోటోతో చెప్పకనే చెప్పింది.
ఈ ఫోటో తో నయనతార దర్శకత్వం వైపు అడుగులు వేయబోతుందని తేలిపోయిందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ కూడా క్రేజ్ ఉన్న సమయంలోనే దర్శకత్వం పై ఆసక్తి చూపించడం జరిగింది. ఇప్పుడు నయన్ కూడా అదే దారిలో వెళ్లడం చాలా మందికి ఆశ్చర్యంను కలిగిస్తోంది.
ఆమె భర్త విఘ్నేష్ శివన్ కూడా దర్శకుడు అనే విషయం తెల్సిందే. అతడి దర్శకత్వంలో నయన్ నటించింది. కనుక నయన్ దర్శకురాలిగా మారి అతడిని ఏమైనా డైరెక్ట్ చేసేందుకు సిద్ధం అవుతుందా అంటూ కూడా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నయనతార కెమెరా ముందు ఉండి అద్భుతాలు ఆవిష్కరించింది. అలాగే కెమెరా వెనుక ఉండి కూడా అద్భుతాలను ఆవిష్కరిస్తుందేమో చూడాలి.