అందమైన అమ్మాయిలే అసూపడేలా `లైలా`బోయ్!
ప్రస్తుతం `లైలా` అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో రెండు వైవిథ్యమైన పాత్రలు పోషిస్తున్నాడు.
By: Tupaki Desk | 14 Jan 2025 6:31 AM GMTయంగ్ హీరో విశ్వక్ సేన్ జోరు మీద సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. వరుసగా సినిమాలు చేస్తూ ఏ మాత్రం గ్యాప్ తీసుకోవడం లేదు. ప్రస్తుతం `లైలా` అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో రెండు వైవిథ్యమైన పాత్రలు పోషిస్తున్నాడు. అందులో ఒకటి లేడీ గెటప్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఆ ఉత్సాహాన్ని జోడిస్తూ, మేకర్స్ స్టైలిష్ అండ్ ఫంకీ అవతార్‌లో విశ్వక్ సేన్‌ను కొన్ని గంటల క్రితమే బోగీ సందర్భంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసారు.
తాజాగా నేడు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని లైలా ఎలా ఉంటుందో పూర్తి పోస్టర్ ని రిలీజ్ చేసారు. అమ్మాయి గెటప్ లో విశ్వక్ ఒదిగిపోయాడు. మ్యాకప్, నుదిటిన స్టిక్కర్ , పెదాలకు లిప్ స్టిక్ , ఐ బ్రోస్, హెయిర్ స్టైల్ ప్రతీది యంగ్ బ్యూటీనే తలపిస్తుంది. అచ్చంగా ఫీమేల్ గెటప్ లో ఒదిగిపోయాడు. విశ్వక్ సేన్ ఫేస్ కి లేడీ గెటప్ పక్కాగా సెట్ అయింది. అబ్బాయి అనే డౌటే ఎక్కడా రాకుండా పర్పెక్ట్ ఆ సూటయ్యాడు.
లైలా తన పెదవులపై వేలితో నిశ్శబ్దాన్ని తెలియజేస్తూ సింబాలిక్ భంగిమలో కనిపిస్తుంది. పింక్ కలర్ థీమ్ బాగుంది. పోస్టర్ మరింత ఆకర్షణీయంగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. విశ్వక్ ని లేడీ గెటప్ లో చూసి షాక్ అవుతున్నారు. ఒక్క క్షణం పాటు విశ్వక్ సేనా? నిజమైన అమ్మాయా? అంటూ షాక్ అవుతున్నారు.
దీంతో టీజర్ పై ఆసక్తి నెలకొంది. పోస్టర్ లోనే విశ్వక్ ని ఇంత అందంగా చూపించడంతో టీజర్ లో మరింత బ్యూటీపుల్ గా కనిపిస్తాడంటూ నెటి జనులు పోస్టులు పెడుతున్నారు. ఇందులో ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ ని జనవరి 17న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తుండగా సాహు గారపాటి నిర్మిస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని సమకూర్చుతున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.