Begin typing your search above and press return to search.

లైలా సెన్సార్.. రన్ టైమ్ ఎంతంటే..!

ఇక ఇటీవల సెన్సార్ పనులు ఫినిష్ చేసుకున్న మేకర్స్ ఫైనల్ రన్ టైమ్ ను లాక్ చేశారు.

By:  Tupaki Desk   |   12 Feb 2025 5:32 AM GMT
లైలా సెన్సార్.. రన్ టైమ్ ఎంతంటే..!
X

విశ్వక్ సేన్ మొదటి సారి లేడీ గెటప్‌లో కనిపించబోతున్న లైలా సినిమాపై మొదటి నుంచీ మంచి పాజిటివ్ బజ్ ఉంది. విశ్వక్ తన కెరీర్‌లో మునుపెన్నడూ చేయని పాత్రను పోషించడం, దానికి తగ్గట్టుగా తన గెటప్, బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఫస్టు లుక్ విడుదలైనప్పటి నుంచి ఈ మూవీపై ఆసక్తి పెరిగింది. ట్రైలర్ విడుదల తర్వాత హైప్ మరింత పెరిగింది. సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఇటీవల సెన్సార్ పనులు ఫినిష్ చేసుకున్న మేకర్స్ ఫైనల్ రన్ టైమ్ ను లాక్ చేశారు.

ట్రైలర్ ద్వారా సినిమాలో ఫన్, ఎమోషన్, యాక్షన్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయని ఒక హింట్ ఇచ్చేశారు. ముఖ్యంగా విశ్వక్ సేన్ సోను మోడల్ క్యారెక్టర్‌లో తో పాటు, లైలా క్యారెక్టర్ లో కూడా అతను చేసిన వేషధారణ, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తోంది. ట్రైలర్ లో వచ్చిన కొన్ని సన్నివేశాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే, విశ్వక్ లైలా క్యారెక్టర్‌లో కేవలం గ్లామర్ మాత్రమే కాదు, యాక్షన్ పరంగానూ అదరగొట్టేలా ఉన్నట్లు కనిపిస్తోంది.

సినిమా సెన్సార్ వర్క్ ఫినిష్ అయ్యింది. ఇక మొత్తం 2 గంటల 16 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టైటిల్స్, యాడ్స్ కలిపి కూడా సినిమా క్రిస్ప్‌గా ఉంటుందని మేకర్స్ తెలిపారు. అంతే కాకుండా, సినిమా పూర్తిగా హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందట. సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా ఏ వర్గం ప్రేక్షకులనైనా బాగా ఎంటర్‌టైన్ చేసేలా ఉంటుందని విశ్వసిస్తున్నారు.

సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో విశ్వక్ సోను మోడల్ క్యారెక్టర్‌లో కనిపిస్తాడట. కామెడీ, రొమాన్స్, మాస్ ఎలిమెంట్స్ మిక్స్‌డ్‌గా సాగే ఈ పార్ట్ ఫుల్ ఫన్‌తో ఉంటుందని చెబుతున్నారు. సెకండ్ హాఫ్ లో విశ్వక్ పూర్తిగా లైలా అవతారం ఎత్తడం, ఆ క్యారెక్టర్ లో అతను చేసే అల్లరి ప్రేక్షకులకు పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనుందని తెలుస్తోంది.

ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ నిర్మించింది. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించగా, మ్యూజిక్ లియోన్ జేమ్స్ అందించారు. ఇక కీలక పాత్రల్లో వెన్నెల కిషోర్, రఘుబాబు, బ్రహ్మాజీ మురళీ శర్మ, థర్టీ ఇయర్స్ పృథ్వీ నటించారు. ఇక పృథ్వీ వివాదం సినిమాపై కొన్ని ప్రతికూల ప్రభావాలను చూపించినా, విశ్వక్ సేన్ మాత్రం తన సినిమా కేవలం వినోదానికి మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడు.

తన లైలా క్యారెక్టర్ తన కెరీర్ బెస్ట్‌గా ఉండబోతుందని, ట్రోల్స్‌తో సినిమా దెబ్బతీయాలని చూడొద్దని ఫ్యాన్స్‌ను కోరాడు. మొత్తానికి ఈ వివాదాన్ని పక్కనపెడితే, లైలా సినిమాపై మాత్రం మంచి అంచనాలు ఉన్నాయి. క్యారెక్టర్ క్లిక్కయితే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.