లైలా ఓటీటీలో అయినా నచ్చుతుందా?
విశ్వక్ సేన్ కెరీర్ లో మొదటిసారి మహిళగా నటించాడు. అతడు లేడీ గెటప్ లో నటించిన 'లైలా' ఇటీవలే విడుదలై ఘోర ఫలితాన్ని అందుకుంది.
By: Tupaki Desk | 5 March 2025 1:46 PM ISTవిశ్వక్ సేన్ కెరీర్ లో మొదటిసారి మహిళగా నటించాడు. అతడు లేడీ గెటప్ లో నటించిన 'లైలా' ఇటీవలే విడుదలై ఘోర ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమా అసభ్యకర సన్నివేశాలు, భాష కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అమ్మాయిగా విశ్వక్ సేన్ వేషధారణ బావున్నా కానీ, భాష భావజాలం తీవ్రమైన విమర్శలకు తెరతీసింది. తెలుగు చిత్రసీమలో చెత్త సినిమాల్లో ఇదొకటి అని విమర్శకులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. లైలాపై వచ్చిన విమర్శలతో షాక్ అయిన విశ్వక్ సేన్ తన అభిమానులకు క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో నోట్‌ను విడుదల చేశారు. అతడు ఫ్యాన్స్, తెలుగు ప్రజలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడం ద్వారా డ్యామేజ్ కంట్రోల్ కి ప్రయత్నించాడు.
ఈ సినిమా మార్చి 7 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుంది. లైలా చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. థియేట్రికల్ గా రిలీజైన మూడు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకొస్తోంది. విశ్వక్ సేన్ కెరీర్ లో కొన్ని తప్పటడుగులు వేసాడు. సక్సెస్ ఉంది.. ప్రతిభ ఉంది. కానీ దానిని నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్నాడు. ఈసారి అలా కాకుండా అభిమానులను నిరాశపరచని క్వాలిటీ ఉన్న సినిమాలో నటించాల్సి ఉంటుంది.
రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో ఆకాంక్ష శర్మ కథానాయికగా నటించింది. షైన్ స్క్రీన్స్‌కు చెందిన సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చారు. లైలా ఓటీటీలో వస్తోంది... కనీసం ఈ స్మార్ట్ డిజిటల్ ఫార్మాట్‌లో అయినా ఆదరణ దక్కించుకుంటుందేమో చూడాలి.