Begin typing your search above and press return to search.

సన్ లైట్ లో మంచు లక్ష్మి గ్లామర్ హీట్.. నెవ్వర్ బిఫోర్!

ఇక ఆ సినిమాలో మంచు లక్ష్మి నటనకి విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

By:  Tupaki Desk   |   15 May 2024 5:07 PM GMT
సన్ లైట్ లో మంచు లక్ష్మి గ్లామర్ హీట్.. నెవ్వర్ బిఫోర్!
X

టాలీవుడ్ లో విభిన్నమైన నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది మంచు లక్ష్మి. మంచు మోహన్ బాబు నట వారసురాలిగా అనగనగా ఒక ధీరుడు సినిమాలో ఐరెంద్రీ అనే పవర్ ఫుల్ విలన్ పాత్రతో తెరంగేట్రం చేసింది. ఇక ఆ సినిమాలో మంచు లక్ష్మి నటనకి విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

తెలుగులో ఎంట్రీకి ముందే మంచు లక్ష్మి పలు హాలీవుడ్ టెలివిజన్ సిరీస్ లలో అలాగే హాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది. మొదట్లో అక్కడే తన కెరీర్ ను కొనసాగించాలని ప్రయత్నాలు కూడా చేసింది. ఇదిలా ఉంటే తెలుగులో నిర్మాతగా మరో వైపు ఫిమేల్ సెంట్రిక్ కథలతో హీరోయిన్ గా మంచు లక్ష్మి ఆ మధ్య బాగానే బిజీగా కనిపించింది. అలాగే హోస్ట్ గా కూడా చేసింది.

ఇక చివరిగా ఆమె మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన మాన్ స్టర్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మంచు లక్ష్మి ఫిట్ నెస్ తో కూడా ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూనే ఉంది.

గ్లామరస్ హీరోయిన్స్ కు ఏమాత్రం తక్కువ కాకుండా ఫొటో షూట్స్ లో కనిపిస్తుంది. ఇక రీసెంట్ గా అమ్మడు బీచ్ ఒడ్డున స్టోన్స్ దగ్గర అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. వాతావరణానికి తగ్గట్టుగా అమ్మడు తన అందంతో మెస్మరైజ్ చేసింది. ఆ లుక్స్ కు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. నాలుగు పదుల వయసులో కూడా ఆమె తన ఫిట్నెస్ తో అందంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

సోషల్ మీడియాలో ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కూడా కనిపిస్తున్న మంచు లక్ష్మి అందం మరింత రెట్టింపు అయ్యిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అలాగే హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నారు అంటూ ప్రసంసిస్తున్నారు. ఇక ఈ స్టిల్స్ లలో మంచు లక్ష్మి నడుము అందాలని చూపిస్తూనే మరో వైపు ఎద అందాలని కూడా ఆరబోసింది. ఇంత అందంగా ఉంటే హీరోయిన్స్ ఎవరూ ఇక పోటీ ఇవ్వలేరని నెటిజన్లు మరొక విధంగా కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. మరి రాబోయే రోజుల్లో అమ్మడు ఇండస్ట్రీలో ఏ విధంగా మెరుస్తుందో చూడాలి.