మంచు లక్ష్మి టాటూలో నాగా కల్చర్ మూలాలు
నాగ టాటూలో బలమైన గిరిజన అంశాలు.. నాగా తత్వశాస్త్రం .. కల్చర్ లో పాతుకుపోయిన సంకేత అర్థాలు ఉన్నాయని మో నాగా వెల్లడించారు
By: Tupaki Desk | 25 April 2024 4:42 PM GMTసెలబ్రిటీ ప్రపంచంలో పచ్చబొట్టుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు 46 ఏళ్ల మంచు లక్ష్మీ తన టాట్టూను ప్రదర్శిస్తూ దాని వెనక కల్చర్ గురించి హిస్టరీ గురించి చెబుతుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఇది నాగా తెగ తాలూకా సంస్కృతి సాంప్రదాయాన్ని చెబుతోంది. ఆ తెగ చరిత్రను ఆవిష్కరిస్తోంది. ఇది సాంస్కృతిక వారసత్వం లోతైన అర్ధంతో నిండిన శక్తివంతమైన చిహ్నం. ప్రఖ్యాత టాటూ ఆర్టిస్ట్ మో నాగా రూపొందించిన క్లిష్టమైన డిజైన్.. లక్ష్మి భుజాలను కలుపుతూ టాటూ వేశారు. నాగా తెగలో యోధుల ఆత్మ, సానుభూతి, దయ, కరుణ గురించి ఆవిష్కరించే టాటూ ఇది. గిరిజన సంస్కృతి సౌందర్యంపై అవగాహన తో మో నాగా ఈ పచ్చబొట్టును తీర్చిదిద్దారు.
నాగ టాటూలో బలమైన గిరిజన అంశాలు.. నాగా తత్వశాస్త్రం .. కల్చర్ లో పాతుకుపోయిన సంకేత అర్థాలు ఉన్నాయని మో నాగా వెల్లడించారు. ఇది ఒక యోధుని స్ఫూర్తి.. కఠినమైన ప్రేమకు సూచిక. కొన్ని నెలల క్రితం లక్ష్మి మంచు ముంబైలో మో నాగాతో అపాయింట్‌మెంట్ పొందాక నాగా తత్వాలు, యోధుల సంప్రదాయాలు, పూర్వీకుల జ్ఞానం గురించి చర్చించడానికి నాలుగు అంకితమైన గంటలు గడిపారు. లక్ష్మి దీనికోసం ఎంతో సహనంగా వేచి చూసారు. టాటూ వేయించుకోవడానికి ఓర్పు సహనం అవసరం.. లక్ష్మీ మంచు అంకితభావంతో సహకరించారని మో నాగా తెలిపారు. కాలేజ్ డేస్ నుంచి పచ్చబొట్లు వేయించుకున్నాను. మో నాగా కేవలం నైపుణ్యం కలిగిన కళాకారుడు మాత్రమే కాదు.. వ్యక్తులను అర్థం చేసుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తాడు... అని లక్ష్మి మంచు తెలిపారు. నా శరీరంపై డిజైన్‌తో నేను పూర్తిగా థ్రిల్ అయ్యాను. ఇది నాకు శక్తి పొందిన అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. నా బలం వ్యక్తీకరణలను టాటూలో అందంగా ప్రదర్శించారని కూడా మంచు లక్ష్మీ తెలిపారు.
ఇటీవల బాలీవుడ్ సినిమాలు, సిరీస్ లలో నటించేందుకు ముంబైలో సొంతంగా నివాసాన్ని ఏర్పరుచుకుంది లక్ష్మీ మంచు. హిందీ చిత్రసీమలో ఎదగాలని కలలుగంటోంది. అదే సమయంలో సౌత్ లోను బిజీగా ఉంది. ప్రస్తుతం నిర్మాణ దశలో మూడు తెలుగు సినిమాలు, త్వరలో విడుదల కానున్న హాట్‌స్టార్ సిరీస్ ... ఒక తమిళ చిత్రం లక్ష్మీ చేస్తోంది.