Begin typing your search above and press return to search.

స్టార్ క‌పుల్ ఇంట్లో ప‌ని మ‌నుషుల‌కు స‌ప‌రేట్ భోజ‌నం ఉండ‌దు!

ఇంత‌కీ ఎవ‌రా ప‌వ‌ర్‌ క‌పుల్ అంటారా? అయితే వివ‌రాల్లోకి వెళ్లాలి.

By:  Tupaki Desk   |   1 Aug 2024 3:00 AM GMT
స్టార్ క‌పుల్ ఇంట్లో ప‌ని మ‌నుషుల‌కు స‌ప‌రేట్ భోజ‌నం ఉండ‌దు!
X

ఇంట్లో ప‌ని మ‌నుషుల‌ను టార్చ‌ర్ చేసేవాళ్లున్నారు. స‌రిగా జీతం ఇవ్వ‌కుండా కొంద‌రు ఇబ్బంది పెడతారు. అద‌న‌పు ప‌ని భారం వేసేవాళ్లుంటారు. కానీ ఈ స్టార్ క‌పుల్ ఇంట్లో స‌న్నివేశమే వేరు. ఇంట్లో ప‌ని మ‌నుషుల‌ను సొంత మ‌నుషుల్లా చూసుకుంటారు. అంతేకాదు తాము ఎలాంటి భోజ‌నం చేస్తారో అదే భోజ‌నాన్ని ప‌ని మ‌నుషుల‌కు అందిస్తారు. ఒక్కోసారి వారితో క‌లిసి కూడా భోజ‌నం చేస్తుంటార‌ట‌. ఇంత‌కీ ఎవ‌రా ప‌వ‌ర్‌ క‌పుల్ అంటారా? అయితే వివ‌రాల్లోకి వెళ్లాలి.

ఇదంతా సైఫ్‌-క‌రీనా జంట గురించే. ఆన్ లైన్ లో ఈ పాపుల‌ర్ క‌పుల్ ఇంట్లో ప‌ని చేసే నానీ గురించి చాలా చ‌ర్చ సాగుతోంది. సెల‌బ్రిటీ ఆయా (నాని) ల‌లితా డిసిల్వా ఇండ‌స్ట్రీ బెస్ట్ శాల‌రీ అందుకుంటారని, నెల‌కు 2.5 ల‌క్ష‌ల పారితోషికం అందుతోంద‌ని ప్ర‌చారం ఉంది. ల‌లిత కేవ‌లం బెబో-సైఫ్ ల‌ వార‌సుడు తైమూర్ అలీఖాన్ కి సేవికురాలు మాత్ర‌మే కాదు.. ఇటు టాలీవుడ్ లో రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న దంప‌తుల వార‌సురాలు క్లిన్ కారాకు కూడా నానీగా స‌హ‌క‌రిస్తున్నారు. చాలామంది సెల‌బ్రిటీ కిడ్స్ కి నానీగా ప‌ని చేసిన అనుభ‌వం త‌న సొంతం.

ల‌లితా డిసిల్వా ఓ ఇంట‌ర్వ్యూలో సైఫ్‌-బెబో జోడీ త‌మ ఇంటి సిబ్బందిని ప‌ని మ‌నుషుల్లాగా ఎప్పుడూ చూడ‌లేద‌ని తెలిపారు. త‌మ ఇంట్లో మ‌నిషిలా చూసుకుంటారు. వారు ఏం తింటే అదే తిన‌మంటారు. క‌లిసే భోజ‌నం చేస్తుంటామ‌ని తెలిపారు. స‌ప‌రేట్ గా ప‌ని మ‌నుషుల‌కు భోజ‌నం వేరే ప‌దార్థాలు ఏవీ ఉండ‌వ‌ని అన్నారు. తైమూర్ నాని లలితా డిసిల్వా, కరీనా కపూర్ -సైఫ్ అలీ ఖాన్ వారి దాతృత్వాన్ని ప్రశంసించారు. వారి ఇంటి సిబ్బందికి అదే ఆహారాన్ని అందిస్తారు.. తరచుగా కలిసి భోజనం చేస్తామ‌ని తెలిపారు. అయితే రూ. 2.5 లక్షల నెలవారీ జీతం గురించి పుకార్లపై మాత్రం ల‌లితా డిసిల్వా న‌వ్వేశారు. ఇది కేవలం ఒక జోక్ అని స్పష్టం చేసారు. సైఫ్ పిల్లలు తైమూర్ - జెహ్ ఇద్ద‌రూ నానీల‌తో క‌లిసి డైనింగ్ టేబుల్ పైనే తింటామ‌ని మారాం చేస్తార‌ట‌.

సైఫ్ అలీఖాన్ ఒక అద్భుతమైన కుక్ అని, పటౌడీకి తమ సందర్శనల సమయంలో తరచుగా భోజనం తయారుచేస్తారని నానీ ల‌లితా పేర్కొన్నారు. తాను మాంసాహారం తినను అని చెప్పిన ల‌లితా.. సైఫ్ త‌యారు చేసే నాన్ వెజ్ వంట‌కాలను పొగిడేసారు. అతడు లాల్ మాస్‌ను తయారు చేయడంలో నిపుణుడు. అలాగే రుచికరమైన స్పఘెట్టి, పాస్తా, ఇతర ఇటాలియన్ వంటకాలు వండడంలో సైఫ్ ఖాన్ సామర్థ్యాలను ఆమె హైలైట్ చేసింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సైఫ్ ప‌లు భారీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. కరీనా కపూర్ త్వరలో `ది బకింగ్‌హామ్ మర్డర్స్`లో కనిపించనుంది. ఇటీవ‌ల విడుద‌లైన క్రూలో క‌రీనా అల్ట్రా గ్లామ‌ర‌స్ లుక్ లో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే.