చరణ్-ఉపాసన గురించి కేర్ టేకర్ లలితా డిసిల్వా మనసులో మాట!
ముఖ్యంగా కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్ కుమారులిద్దరు లలితా డిసిల్వా చేతుల్లో పెరిగిన వారే.
By: Tupaki Desk | 31 July 2024 12:18 PM GMTలలితా డిసిల్వా ఈ పేరు బాలీవుడ్ టూ టాలీవుడ్ లో ఎంతో ఫేమస్. సెలబ్రిటీ ఫ్యామిలీకి సంబంధించి బెస్ట్ కేర్ టేకర్ గా ఆమెకంటూ ఓ రికార్డు ఉంది. అపరకుబేరుడు అంబానీ చిన్న కుమారుడు అనంత్ సంరక్షురాలిగా ఆమె పని చేసారు. ఆ తర్వాత బాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీల పిల్లలకు కేర్ టేకర్ గా కొనసాగారు. ముఖ్యంగా కరీనా కపూర్-సైఫ్ అలీఖాన్ కుమారులిద్దరు లలితా డిసిల్వా చేతుల్లో పెరిగిన వారే.
ఇప్పటికీ ఆమె వాళ్లతో పాటు ఉంటున్నారు. ఆరకంగా లలితా డిసిల్వా కరీనా కుటుంబంలో ఓ ఫ్యామిలీ మెబర్ అయిపోయారు. ఈ విషయాన్ని ఓసందర్భంలో స్వయంగా కరీనా కపూర్ రివీల్ చేసింది. అప్పటి నుంచి లలితా డిసిల్వా మరింత వెలుగులోకి వచ్చారు. ఆమె ట్రాక్ రికార్డు చూసే రామ్ చరణ్ -ఉపాసన దంపతులు కూడా క్లింకార సంరక్షురాలిగా నియమించుకున్నారు. క్లీంకార పుట్టిన నాటి నుంచి లలితా డిసిల్వా ఆ ఫ్యామిలీ లో కూడా ఓ మెంబర్ గా మారిపోయారు.
తాజాగా ఓ సందర్భంలో చరణ్-ఉపాసన ల గురించి లిలితా డిసిల్వా ఆసక్తికర విషయాలు పంచుకు న్నారు. రామ్ చరణ్ - ఉపాసన ఇద్దరూ తమ కూమార్తె విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. వారు కుమార్తెకు దూరంగా ఉన్నప్పటికీ వాళ్ల మనసంతా ఇంటివైపే ఉంటుంది. ఆ విషయంలో ఇద్దరు ఎంతో అంకిత భావంతో ఉంటారు. ఉపాసన ఎంతో డౌన్ టు ఎర్త్. ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి కావాల్సినంత సమయాన్ని కేటాయిస్తుంది.
నన్ను తన కుటుంబంలో సభ్యురాలిగా చూస్తారు. ఆ జంటను చూస్తే నాకెంతో ముచ్చటగా అనిపిస్తుంది` అని తెలిపారు. ఈ సందర్భంగా చరణ్ దంపతులతో ఆమెదిగిన ఓ ఫోటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. అంబానీ ఫ్యామిలీ లలితా డిసిల్వాని గుర్తు పెట్టుకుని మరీ అనంత్ అంబానీ పెళ్లికి ఆహ్వనించారు. అనంత్ లలితా డిసిల్వా చేతుల్లో పెరిగిన వాడే. వివాహానికి ఆమె హాజరవ్వడంతా పెళ్లి మొత్తానికి ఆవిడే హైలైట్ అయింది. ఎవరీవడ? అంటూ అందరిలోనూ చర్చకొచ్చింది.