గత ఏడాది రూ.30 కోట్లు.. ఈ ఏడాది రూ.1 కోటి
సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది జైలర్ సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వయసుకు తగ్గ పాత్రలో రజినీకాంత్ నటించి మెప్పించాడు
By: Tupaki Desk | 12 Feb 2024 5:48 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది జైలర్ సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వయసుకు తగ్గ పాత్రలో రజినీకాంత్ నటించి మెప్పించాడు. ప్రపంచ వ్యాప్తంగా జైలర్ సినిమా దాదాపుగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా రూ.30 కోట్ల వసూళ్లు రాబట్టినట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు ప్రకటించారు.
జైలర్ సినిమా హిట్ నేపథ్యంలో రజినీకాంత్ తదుపరి సినిమా అయిన లాల్ సలామ్ ను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేస్తే కచ్చితంగా మంచి వసూళ్లు వస్తాయని అంతా భావించారు. కానీ తెలుగు రాష్ట్రాల మార్కెట్ ను లాల్ సలామ్ యూనిట్ సభ్యులు పూర్తిగా విష్మరించినట్లుగా అనిపించింది.
తెలుగు రాష్ట్రాల్లో మినిమం ప్రచారం చేయకపోవడం తో పాటు, ఎక్కువ థియేటర్ల కోసం అస్సలు ప్రయత్నించలేదు. అంతే కాకుంగా డిజిటల్ ప్రచారం కూడా చేయలేదు. అసలు తెలుగు రాష్ట్రాల్లో లాల్ సలామ్ విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
తాజాగా విడుదల అయిన లాల్ సలామ్ టాక్ తో సంబంధం లేకుండా తమిళనాట భారీగా ఓపెనింగ్ వసూళ్లు రాబట్టింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దారుణమైన నెంబర్స్ నమోదు అయ్యాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ పరువు పోయే విధంగా మొదటి మూడు రోజుల వసూళ్లు ఉన్నాయి.
రజినీకాంత్ గత చిత్రం 30 కోట్ల వసూళ్లు నమోదు చేస్తే లాల్ సలామ్ మాత్రం కనీసం కోటి వసూళ్లు కూడా నమోదు చేయలేక పోయింది. ఇలాంటి పరిస్థితికి కారణం ఏంటి అంటే కచ్చితంగా యూనిట్ సభ్యుల అలసత్వం అన్నట్లుగా రజినీకాంత్ ఫ్యాన్స్ తో పాటు మీడియా వర్గాల వారు విమర్శలు చేస్తున్నారు.