పొంగల్ రేస్ నుంచి తప్పుకున్న సూపర్ స్టార్!
వచ్చే సంక్రాంతి బరిలో తెలుగులో అర డజనుకు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి
By: Tupaki Desk | 21 Dec 2023 3:10 PM GMTవచ్చే సంక్రాంతి బరిలో తెలుగులో అర డజనుకు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలకే థియేటర్లు సరిపోవని బయ్యర్స్ ఇబ్బందులు పడుతుంటే అదే సమయంలో మూడు తమిళనాడు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. అయితే వీటిలో రజినీకాంత్ నటించిన 'లాల్ సలాం' సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లు తాజా అప్డేట్ బయటికి వచ్చింది.
రజనీకాంత్ అల్లుడు ధనుష్ అదే సీజన్లో 'కెప్టెన్ మిల్లర్' సినిమా విడుదలవుతుండడం ఓ కారణమైతే తెలుగులో భారీ పోటీ మధ్య నలిగిపోవడం కరెక్ట్ కాదని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. అయితే తమిళం నుంచి శివ కార్తికే 'అయలాన్' మూవీ మాత్రం ఇంకా సంక్రాంతి బరిలోనే ఉంది. నిజం చెప్పాలంటే 'లాల్ సలాం' మూవీ మీద ఆడియన్స్ లో ఆశించిన స్థాయిలో హైప్ లేదు.
రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఈ సినిమాకి దర్శకత్వం వహించడం, అలాగే సూపర్ స్టార్ ఇందులో గెస్ట్ రోల్ చేస్తున్నాడా? లేక సినిమా అంతా ఉంటాడా? అనేది క్లారిటీ లేదు. అయితే 'జైలర్' బ్లాక్ బస్టర్ కావడంతో ఒక్కసారిగా 'లాల్ సలాం' పై కోలీవుడ్ లో భారీ క్రేజ్ ఏర్పడింది. కాకపోతే పెద్ద సినిమాలు తో పోటీ పడడం సేఫ్ కాదని, అనవసరంగా తగ్గించుకోవడం అవుతుందని భావించి మేకర్స్ ఫైనల్ గా సంక్రాంతి నుంచి డ్రాప్ అయ్యారు.
అందుకే ఇకనుంచి ప్రమోషన్స్ కి సైతం బ్రేక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇక సంక్రాంతి తర్వాత రిపబ్లిక్ డే అంటే జనవరి 26 న థియేటర్స్లోకి రావాలనుకున్న విక్రమ్ 'తంగలాన్' కూడా జనవరి 26 నుంచి సమ్మర్ కి షిఫ్ట్ అయింది. కాబట్టి ఖాళీగా ఉన్న ఆ డేట్ ని లాల్ సలాం వాడుకునే అవకాశం ఉంది. ఇక తెలుగులో జైలర్ తర్వాత రజినీకాంత్ మార్కెట్ మళ్ళీ పుంజుకుంది.
జైలర్ కంటే ముందు వరకు వరుస ప్లాప్స్ తో పూర్తిగా డౌన్ అయిన సూపర్ స్టార్ రేంజ్ ని జైలర్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అందుకే లాల్ సలాం విషయంలో లైకా నిర్మాణ సంస్థ జాగ్రత్తలు తీసుకుంటోంది. స్పోర్ట్స్ కం యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కడం, రజినీకాంత్ ఫస్ట్ టైమ్ ముస్లిం లీడర్ గా కనిపిస్తుడటంతో 'లాల్ సలామ్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.