Begin typing your search above and press return to search.

మరీ షోలు క్యాన్సిల్ అవ్వడమేంటి తలైవా?

సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది బౌన్స్ బ్యాక్ అయిన విధానం సీనియర్ హీరోలకు మరింత బూస్ట్ ఇచ్చింది

By:  Tupaki Desk   |   9 Feb 2024 4:53 PM GMT
మరీ షోలు క్యాన్సిల్ అవ్వడమేంటి తలైవా?
X

సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది బౌన్స్ బ్యాక్ అయిన విధానం సీనియర్ హీరోలకు మరింత బూస్ట్ ఇచ్చింది. తలైవా తలచుకుంటే బాక్సాఫీస్ ఏ రేంజ్ లో షేక్ అవుతుందో మరోసారి రుజువైంది. నిజానికి జైలర్ సో సో సినిమానే కానీ రజినీకాంత్ క్రేజ్ వలన సరైన టైమ్ లో రిలీజ్ కావడం ఆ సినిమాకి బాగా కలిసి వచ్చింది. అందుకే బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి.

అయితే అంత పెద్ద సక్సెస్ అందుకున్నటువంటి రజనీకాంత్ ఆ తర్వాత ఒక గెస్ట్ రోల్ తో కూతురు సినిమాకు మంచి క్రేజ్ తీసుకు వాస్తారు అనుకుంటే బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. లాల్ సలామ్ కు ముఖ్యంగా తెలుగులో అయితే విడుదలకు ముందే పెద్దగా హైప్ క్రియేట్ కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రమోషన్స్ హడావుడి కూడా పెద్దగా కనిపించలేదు.

దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇక లాల్ సలామ్ సినిమాలో ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ధనుష్ నుంచి విడిపోయిన తర్వాత కాస్త డిప్రెషన్ కు లోనయినట్లు కనిపించిన కూతురుకి తండ్రిగా రజనీకాంత్ కావలసినంత సపోర్ట్ ఇచ్చాడు. అంతేకాకుండా మళ్ళీ డైరెక్షన్ లోకి అడుగుపెడుతోంది అనగానే పూర్తిస్థాయిలో 40 నిమిషాల గెస్ట్ రోల్ చేసి మంచి బూస్ట్ ఇచ్చాడు.

అయితే ఈ గెస్ట్ రోల్ పెద్దగా పస లేదు. దానికి తోడు సరైన పద్ధతి లో ప్రమోషన్స్ చేయకపోవడం కూడా పెద్ద మైనస్. కనీసం హడావుడి చేసుంటే ఓపెనింగ్స్ అయినా వచ్చేవి. కానీ చిత్ర యూనిట్ అలా చేయకుండా సూపర్ స్టార్ ను నమ్ముకొని గుడ్డిగా అడుగేసింది. తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా రజినీకాంత్ రేంజ్ కు తగ్గట్టుగా సౌండ్ అయితే కనిపించలేదు.

ఇక తెలుగులో అయితే ఉదయం షోలు కూడా కొన్ని క్యాన్సిల్ అవ్వడం బయ్యర్లకు షాక్ అనే చెప్పాలి. అసలు రజనీకాంత్ ఉన్నారు అంటేనే యువ అభిమానులు కూడా మొదటి రోజు మొదటి సోను చేసేందుకు ఎగబడతారు. కానీ లాల్ సలాం సినిమా విషయంలో అసలు హడావుడి కొంచెం కూడా కనిపించలేదు. ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ లాంటి యువ హీరోలు నటించారు. స్పోర్ట్స్ క్రైమ్ డ్రామా నేపథ్యంలో రూపొందిన లాల్ సలామ్ ఇలానే కొనసాగితే రజినీకాంత్ నటించిన సినిమాల్లో బిగెస్ట్ డిజాస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.