Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ రేసులో ఉన్నట్లా? లేనట్లా?

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందిన లాల్‌ సలామ్ సినిమాలో రజనీకాంత్‌ గెస్ట్‌ అప్పియరెన్స్‌ అన్నట్లుగా కొందరు మాట్లాడుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   7 Feb 2024 5:40 AM GMT
సూపర్‌ స్టార్‌ రేసులో ఉన్నట్లా? లేనట్లా?
X

సాధారణంగా సూపర్‌ స్టార్ సినిమా వస్తుందంటే హడావుడి మామూలుగా ఉండదు. రజనీకాంత్‌ తమిళ్ సినిమా తెలుగు లో డబ్‌ అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సారి సందడి వాతావరణం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అందుకు విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయి.

రజనీకాంత్‌ గత చిత్రం జైలర్ తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. దాంతో ఆయన తదుపరి సినిమాకు అంతకు మించి అన్నట్లుగా బజ్ క్రియేట్‌ అవ్వాల్సి ఉంది. కానీ లాల్‌ సలామ్‌ సినిమా విషయంలో మాత్రం అది జరగలేదు. మరి కొన్ని గంటల్లో విడుదల అవ్వబోతున్న లాల్‌ సలామ్ సినిమా పై అసలు ఆసక్తి కనిపించడం లేదు.

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందిన లాల్‌ సలామ్ సినిమాలో రజనీకాంత్‌ గెస్ట్‌ అప్పియరెన్స్‌ అన్నట్లుగా కొందరు మాట్లాడుకుంటున్నారు. దానికి తోడు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మినిమం పబ్లిసిటీ కూడా చేయలేదు. దాంతో లాల్ సలామ్‌ అసలు రిలీజ్ ఉన్నట్లా? లేనట్లా? అన్నట్లుగా కూడా పరిస్థితి ఉంది.

ఈ వారంలో రవితేజ సినిమా ఈగల్ విడుదల అవ్వబోతుంది. అంతే కాకుండా యాత్ర 2 సినిమా కూడా ఉంది. ఈ రెండు సినిమాల మధ్య లాల్ సలామ్‌ సినిమా అస్సలు కనిపించడం లేదు. సూపర్‌ స్టార్‌ నటించిన సినిమా అయినా కూడా ఆ స్థాయిలో పబ్లిసిటీ లేదు.. అసలు రిలీజ్‌ ఉందా అన్న పరిస్థితి నెలకొందంటే సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

స్పోర్ట్స్ డ్రామా గా రూపొందిన లాల్‌ సలామ్ లో రజనీకాంత్ మాత్రమే కాకుండా ప్రముఖ నటీనటులు, క్రికెట్‌ ప్రముఖులు కూడా కనిపించబోతున్నారు. అయినా కూడా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ విఫలం అయ్యారు. విడుదల తర్వాత పాజిటివ్‌ టాక్‌ వస్తే అప్పుడు ఏమైనా హడావిడి చేస్తారేమో చూడాలి.