'లాల్ సలామ్' ట్రైలర్.. ఎలా ఉందంటే..
గత ఏడాది 'జైలర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ అదే ఊపులో వరుస సినిమాలు చేస్తున్నారు
By: Tupaki Desk | 7 Feb 2024 6:07 PM GMTగత ఏడాది 'జైలర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ అదే ఊపులో వరుస సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో 'లాల్ సలామ్' అనే సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. విష్ణువిశాల్, విక్రాంత్ లీడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్, సాంగ్స్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ అయిన లాల్ సలాం ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ట్రైలర్ లో మొయినుద్దీన్ భాయ్ గా రజినీకాంత్ ఆదరగొట్టేశారు. ఆయన పాత్రను తీర్చిదిద్దిన తీరు ఫ్యాన్స్‌లో ఆసక్తిని కలిగిస్తోంది. మెయినుద్దీన్ భాయ్గా రజనీ పాత్ర ఎంతో పవర్ ఫుల్గా కనిపిస్తోంది. అయితే ఇది ఫుల్ లెంగ్త్ రోల్ కానప్పటికీ కథలో ఎంతో కీలకంగా ఉండే పాత్ర అని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.
అంతేకాదు ముస్లిం గెటప్ లో రజనీకాంత్ సరికొత్తగా కనిపించి ఆకట్టుకున్నారు. ట్రైలర్ లో సూపర్ స్టార్ యాక్షన్ ఎలివేషన్స్ ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ అని చెప్పొచ్చు. క్రికెట్, మతం, రాజకీయాలు, అధికారం వంటి అంశాల చుట్టూ ఈ సినిమా కథ ఉండబోతుందని ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతుంది. ఇక ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
మొత్తంగా లాల్ సలాం ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. దాదాపు ఏడేళ్ల తర్వాత రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమాతో సీనియర్ నటి జీవిత రీ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది.
లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మొదట ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ పలు అనివార్య కారణాలవల్ల రిలీజ్ చేయలేకపోయారు. ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.