తెరపైకి మరో సైనికుడు జీవితం!
బాలీవుడ్ లో బయోపిక్ లకు తిరుగులేదు. వాస్తవ కథలో సోల్ ఉంటే చాలు బాక్సాఫీస్ వద్ద పంటపండినట్లే
By: Tupaki Desk | 9 April 2024 3:30 PM GMTబాలీవుడ్ లో బయోపిక్ లకు తిరుగులేదు. వాస్తవ కథలో సోల్ ఉంటే చాలు బాక్సాఫీస్ వద్ద పంటపండినట్లే. అందుకే హిందీలో బయోపిక్ లు తెరకెక్కించడం అన్నది ఓ అలవాటుగా మారిపోయింది. ప్రస్తుతం దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజుపేయి జీవితం అధారంగా 'అటల్' అనే చిత్రం తెరకెక్కుతుంది. అలాగే స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో 'మైదాన్' అనే మరో ఇనిస్పేరేషనల్ స్టోరీ రూపొందుతుంది. ఈ రెండు చిత్రాలతో పాటు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ అంధ పారిశ్రామికవేత్త - బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీకాంత్ బొల్లా జీవితం కూడా తెరకెక్కుతోది.
ఈ నేపథ్యంలో తాజాగా భారత అమరవీరుడు ..అశోక చక్ర అవార్డు గ్రహీత లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీ జీవితం ఆధారంగా 'ఇఖ్వాన్' టైటిల్ తో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బేవేజా స్టూడియోస్ కి చెందిన హర్మన్ బవేజీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. లాన్స్ నాయక్ కథలో చాలా ఎమోషన్ ఉంది. కశ్మీర్ కి చెందిన నజీర్ ముందు ఉగ్రవాదిగా ఉండేవాడు. కొన్నాళ్లకు తనకు గానుగానే తప్పుడు దారిలో వెళ్తున్నానని గ్రహించి ముష్కర మూకల నుంచి బయట పడ్డాడు. ఆ తర్వాత భారత సైన్యంలో చేరాడు.
2018 నవంబర్ లో తీవ్రవాదులతో జరిగిన భీకరమైన పోరులో వీరమరణం పొందాడు. ఇప్పుడాయన కథ మొత్తాన్ని బయోపిక్ గా తెరపైకి తెస్తున్నారు. ఉగ్రవాదిగా ఎందుకు మారాల్సి వచ్చింది? అటుపై అక్కడ నుంచి ఎలా బయటకు వచ్చాడు? అందుకు గల కారణాలు ఏంటి? వంటి ఎన్నో విషయాలు ఇందులో చర్చించనున్నారు. ప్రాజెక్ట్ ప్రకటించిన సందర్భంగా హర్మాన్ బవేజా మాట్లాడుతూ..' లాన్స్ నాయక్ కథని తెరకెక్కించడాన్ని ఎంతో గర్వంగా భావిస్తున్నాం. దేశం కోసం ఆయన చేసిన త్యాగం వెలకట్టలేనిది.
ముఖ్యంగా దారి తప్పిన మిలిటెంట్ ప్రస్తానం నుంచి మొదలై దేశ సేవ కోసం సైన్యంలో చేరి..అమరుడైన విధానం తప్పకుండా అందరూ చూడాల్సిందే. ఇలాంటి కథల్ని తెరకెక్కించడం నిర్మాతలు బాధ్యతగా భావించాలి' అని అన్నారు. అయితే లాన్స్ నాయక్ పాత్రలో ఎవరు నటిస్తున్నారు? ఇతర నటీనటులు ఎవరు? దర్శకుడు వివరాలు వంటివి రివీల్ చేయలేదు. ఆ వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.