విదేశీ భామ క్యూట్ గా కాటేసిందే?
విదేశీ భామ లరిస్సా బొనేసీ సుపరిచితమే. `తిక్క`..`నెక్స్ట్ ఏంటి` లాంటి చిత్రాల్లో ఆడిపాడిన అమ్మడికి అటుపై అవకాశాలు రాలేదు.
By: Tupaki Desk | 17 July 2024 6:32 AM GMTవిదేశీ భామ లరిస్సా బొనేసీ సుపరిచితమే. `తిక్క`..`నెక్స్ట్ ఏంటి` లాంటి చిత్రాల్లో ఆడిపాడిన అమ్మడికి అటుపై అవకాశాలు రాలేదు. ముంబైలో ఉండి ప్రయత్నాలు చేస్తోందిగానీ అమ్మడికి ఛాన్సులిచ్చేవారే లేరు. అందం..అభినయం గల భామే అయినా అదృష్టం కలిసి రాలేదు. ఇక అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. రేర్ గా హాట్ ఫోటోలతో దర్శనమిస్తుంది. స్విమ్ షూట్...బీచ్ షూట్ అంటూ ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా ఎన్నోసార్లు వైరల్ అయింది.
తాజాగా సొగసరి మరోసారి డిజైనర్ ఔట్ ఫిట్ లో మెరిసింది. వైట్ కలర్ డిజైనర్ అమ్మడిని మరింత అందంగా హైలైట్ చేస్తుంది. లరిస్సా శరీర సౌష్టవానికి ఔట్ ఫిట్ పర్పెక్ట్ గా సూటయింది. అమ్మడి స్కిన్ టోన్..హెయిర్ స్టైల్..మ్యాకప్ ప్రతీది లరిస్సాని అందంగా ప్రొజెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. లరిస్సా బ్యూటీని నెటి జనులు ఫిదా అవుతున్నారు.
అమ్మడిని ప్రపోజల్స్ తో ముంచేస్తున్నారు. లుక్స్ గార్జియస్..బ్యూటీఫుల్ లేడీ అంటూ పొగిడేస్తున్నారు. నటిగా కంటే లరిస్సా ఇటీవల షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తో డేటింగ్ చేస్తోంది! అన్న వార్త ఎంత సంచలనమైందో తెలిసిందే. ఇద్దరు పబ్ లో చిక్కినట్లు ప్రచారం సాగింది. ఆర్యన్ ఖాన్ తర్వాత...లరిస్సా పవ్ లోకి ప్రవేశించినట్లు..అక్కడే ఆర్యన్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.
కానీ లరిస్సా ముఖం మాత్రం క్లారిటీ లేకపోవడంతో కొంత సందేహం ఉంది. అంతకు ముందే ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం బాలీవుడ్ మీడియాని వెడెక్కించింది. మొన్నటి ఆధారం ఇంకాస్త బలంగా దొరికితే విషయం కన్పమ్ అయ్యేది. అయితే ఈ వార్తతో లరిస్సా బాగా పాపులర్ అయింది. ఏకంగా కింగ్ ఖాన్ కుమారుడినే బుట్టలో వేసిందా? అంటూ నెటి జనులు కామెంట్ల వర్షం కురిపించారు.