ఫోటో స్టోరి: పింక్ బికినీలో మెరుపు తీగ
ఇంతకీ ఎవరీ మెరుపు తీగ? అంత సింపుల్ గా ఎలాంటి షై అన్నదే లేకుండా ఎర్ర బికినీలో కెమెరాలకు ఫోజులిచ్చేస్తోంది?
By: Tupaki Desk | 4 May 2024 4:30 AM GMTఅవును.. ఎర్ర బికినీలో తీగ లాంటి అమ్మాయి.. సరికొత్త ఫోటోషూట్ తో మైండ్ బ్లాక్ చేస్తోంది. యూత్ కి కునుకుపట్టనివ్వని ట్రీటిస్తోంది. ఇంతకీ ఎవరీ మెరుపు తీగ? అంత సింపుల్ గా ఎలాంటి షై అన్నదే లేకుండా ఎర్ర బికినీలో కెమెరాలకు ఫోజులిచ్చేస్తోంది?
పేరు లారిస్సా బోనెస్సీ. సాయిధరమ్ సరసన తిక్కలో నటించింది. అప్పట్లోనే సదరు యంగ్ హీరో ఈ భామకు ప్రపోజ్ చేసాడు. తన అందానికి దాసోహం అన్నాడని కథనాలొచ్చాయి. అదంతా అటుంచితే లారిస్సా బోనెస్సీ ఇటీవల బాలీవుడ్ లో బిగ్ డ్రీమ్స్ తో ముందుకు సాగుతోంది. అంతేకాదు కింగ్ ఖాన్ షారూఖ్ వారసుడు ఆర్యన్ ఖాన్‌తో ఎంతో సన్నిహితంగా మెలుగుతోంది. ఆ ఇద్దరి నడుమా ఏదో జరుగుతోందని కూడా గుసగుసలు వినిపించాయి.ఈ పుకార్ల మ్యాటర్ అటుంచితే.. లారిస్సా నెక్ట్స్ గోల్ ఏంటన్నదే ఆశ్చర్యంగా మారింది.
లారిస్సా తాజాగా పూల్ సైడ్ ప్రత్యక్షమైంది. అది కూడా పింక్ బికినీలో గుండెలు కొల్లగొడుతోంది. లైవ్ లీగా వెట్ లుక్ లో కనిపించిన లారిస్సా టూ హాట్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా పింక్ బికినీలో మెరుపుతీగనే తలపిస్తోంది. తిక్క తర్వాత టాలీవుడ్ లో అడపాదడపా నటించింది ఈ బ్యూటీ. తిక్క, పెంట్ హౌస్, నెక్స్ట్ ఏంటి? వంటి సినిమాల్లో కనిపించింది. తిక్క చిత్రానికి సునీల్ కుమార్ రెడ్డి - బి.ఆర్.దుగ్గినేని కర్తలు. మన్నారా చోప్రా ఇందులో మరో కథానాయిక. నెక్స్ట్ ఏంటి? 2018లో విడుదలైంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్, తమన్నా భాటియా, నవదీప్, పూనమ్ కౌర్, తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. లారిస్సా సోషల్ మీడియా ఔత్సాహికురాలు. ఇన్‌స్టాగ్రామ్‌లో 562కె ఫాలోవర్లతో భారీ ఫాలోయింగ్‌ను కలిగి ఉంది. లారిస్సా గొప్ప నర్తకి.. ఫిట్నెస్ ఫ్రీక్ కూడా.
ఆర్యన్ ఖాన్ ఇప్పటికే తన విజయవంతమైన దుస్తుల బ్రాండ్‌తో వ్యాపారవేత్తగా తన కెరీర్ మార్గంలో దూసుకుపోతున్నాడు. అతడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. అయితే ఇప్పుడే నటించే ఆలోచన లేదు. ప్రస్తుతానికి తన తొలి వెబ్ సిరీస్ `స్టార్డమ్`కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆరు ఎపిసోడ్ల సిరీస్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ నేపథ్యంలో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఈ సిరీస్ ని నిర్మిస్తోంది.