Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: లారిస్సా బోనెస్సీ టాప్‌లెస్ లుక్

కొంత‌కాలంగా కింగ్ ఖాన్ షారూఖ్ వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ - మోడ‌ల్ కం న‌టి లారిస్సా బోనెస్సీ రిలేష‌న్ షిప్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది

By:  Tupaki Desk   |   22 Aug 2024 4:37 AM GMT
ఫోటో స్టోరి: లారిస్సా బోనెస్సీ టాప్‌లెస్ లుక్
X

కొంత‌కాలంగా కింగ్ ఖాన్ షారూఖ్ వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ - మోడ‌ల్ కం న‌టి లారిస్సా బోనెస్సీ రిలేష‌న్ షిప్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆర్య‌న్ ఏ ఈవెంట్లో ఉన్నా అక్క‌డ లారిస్సా క‌నిపిస్తోంది. అంతేకాదు ఆర్య‌న్ ఈ బ్యూటీకి ఫ్యామిలీ ఫ్రెండుగా మారాడు. లారిస్సా త‌ల్లికి అత‌డు బ‌హుమ‌తులు అందించాడు. ప్ర‌తిసారీ ఈవెంట్ల‌లో క‌లిసి సందడి చేస్తున్నారు. దీంతో హిందీ మీడియా అదే ప‌నిగా ఆ ఇద్ద‌రి అనుబంధం గురించి క‌థ‌లు ప్ర‌చారం చేస్తోంది.

అదంతా అటుంచితే.. ఆర్య‌న్ స‌హాయంతో లారిస్సా తిరిగి త‌న కెరీర్ ని రీబిల్ట్ చేయ‌బోతోందంటూ ప్ర‌చారం సాగుతోంది. లారిస్సా టాప్ మోడ‌ల్ కం న‌టి. ప‌లు ఆల్బ‌మ్స్ లోను న‌టించింది. కానీ స్టార్ గా ఎద‌గ‌లేక‌పోయింది. ప‌లు చిత్రాల్లో అతిథి పాత్ర‌లు, అంత‌గా ప్రాధాన్య‌త లేని పాత్ర‌లు మిన‌హా కెరీర్ కి బిగ్ బ్రేక్ నిచ్చే ఒక్క అవ‌కాశం కూడా ద‌క్కించుకోలేక‌పోయింది.

లారిస్సా ఇంత‌కుముందు `తిక్క` సినిమాతో తెలుగు ప‌రిశ్ర‌మ‌లోను అడుగుపెట్టింది. మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న న‌టించింది. కానీ ఆ సినిమా ఫ్లాపైన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లోనే లారిస్సాకు ప్ర‌పోజ్ చేసాన‌ని వ‌న్ సైడ్ ల‌వ్ అని సాయి ధ‌ర‌మ్ బ‌హిరంగంగానే అంగీక‌రించాడు. ఆ త‌ర్వాత లారిస్సా తెలుగు సినిమాల్లో క‌నిపించ‌లేదు. ప్ర‌స్తుతం హిందీ చిత్ర‌సీమ‌లోనే పెద్ద అవ‌కాశాల కోసం వెతుకుతోంది. ఇలాంటి కీల‌క ద‌శ‌లో ఆర్య‌న్ తో స్నేహం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. మ‌రోవైపు లారిస్సా వ‌రుస ఫోటోషూట్ల‌తో హాట్ టాపిక్ గా మారుతోంది.

తాజాగా ఈ బ్రెజిలియ‌న్ బ్యూటీ షేర్ చేసిన హా* ఫోటోషూట్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. ఈ ఫోటోషూట్ లో లారిస్సా టాప్ లెస్ గా క‌నిపించింది. పొట్టి నిక్క‌రు, బ్లాక్ క‌ల‌ర్ బ్లేజ‌ర్ ని ధ‌రించిన లారిస్సా త‌న ఇన్న‌ర్ అందాల‌ను బోల్డ్ గా ఎలివేట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా దూసుకెళుతోంది. లారిస్సా సంథింగ్ స్పెష‌ల్ గా ఉందంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. విదేశీ అందం టూమ‌చ్ బోల్డ్‌గా ఉందంటూ కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. లారిస్సా ప్ర‌య‌త్నం ఫ‌లించి కెరీర్ కి బిగ్ బ్రేక్ నిచ్చే అవ‌కాశం ద‌క్కుతుందేమో చూడాలి.