కీర్తి సురేష్ పెళ్లి.. ఇంతకు వరుడు ఎవరు?
ఇక అతను ఎవరు అనే వివరాల్లోకి వెళ్తే, కొచ్చికి చెందిన ఆంటోని తట్టిల్ అనే వ్యక్తితో కీర్తి చాలా కాలంగా ప్రేమలో ఉందని టాక్ నడుస్తోంది. ఆంటోని ఒక వ్యాపారవేత్తగా, కీర్తికి బలమైన సపోర్ట్‌గా నిలిచాడని వినిపిస్తోంది.
By: Tupaki Desk | 19 Nov 2024 6:52 AM GMTసౌత్ ఇండస్ట్రీలో ఎంతమంది గ్లామరస్ హీరోయిన్స్ ఉన్నా కూడా తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో కీర్తి సురేష్ ఒకరు. ఇక నిత్యం సినిమాలతో బిజీగా ఉండే మహానటి పేరు ఇప్పుడు పెళ్లి వార్తలతో తెరపైకి వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో హిట్ సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా గ్రాండ్ గానే అడుగుపెడుతోంది. వరుణ్ ధావన్‌తో కలిసి తెరి రీమేక్ గా హిందీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక కీర్తి, ఈ మధ్య ఎక్కువగా ముంబైలోనే ఉంటుంది. అయితే, ఇటీవల ఆమె పెళ్లి గురించి వచ్చిన వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక అబ్బాయి ఎవరు అనే విషయంలో కూడా అనేక రకాల గాసిప్స్ పుట్టుకొచ్చాయి. ఇక అతను ఎవరు అనే వివరాల్లోకి వెళ్తే, కొచ్చికి చెందిన ఆంటోని తట్టిల్ అనే వ్యక్తితో కీర్తి చాలా కాలంగా ప్రేమలో ఉందని టాక్ నడుస్తోంది. ఆంటోని ఒక వ్యాపారవేత్తగా, కీర్తికి బలమైన సపోర్ట్‌గా నిలిచాడని వినిపిస్తోంది.
లేటెస్ట్ టాక్ ప్రకారం, డిసెంబర్ 11-12 తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతుందని సమాచారం. వీటిపై అధికారిక ప్రకటన లేకపోయినా, ఈ వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇక కీర్తి పెళ్లి గురించి వార్తలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ కీర్తి సురేష్ పెళ్లి రూమర్స్ తెగ చక్కర్లు కొట్టాయి. బిజినెస్‌మాన్‌ల నుంచి మ్యూజిక్ డైరెక్టర్స్ వరకు అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
అప్పట్లో తన కుటుంబ సభ్యులు ఈ వార్తలను ఖండించారు. ఇప్పుడు మళ్లీ ఆంటోని పేరు వినిపించడం ఆశక్తిని పెంచుతోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ ఇటీవల తన ప్రొఫెషనల్ జీవితంలో చాలా బిజీగా ఉంది. వరుణ్ ధావన్‌తో సినిమా, తమిళ ప్రాజెక్ట్స్, అలాగే తన సోషల్ మీడియా పోస్ట్‌లతో అభిమానులను అలరిస్తోంది. అయితే పెళ్లి వార్తలపై అమ్మడు ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. గతంలోనూ ఇలాంటి పుకార్లపై క్లారిటీ ఇచ్చిన కీర్తి, ఈసారి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
కీర్తి స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇప్పటిదాకా పెళ్లి మ్యాటర్ పై ఒక్క న్యూస్ కూడా బయటకు రాలేదు. ఒకవేళ గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ నిజమైతే, వారి కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో రూమర్స్ వచ్చినప్పుడు పెళ్లి సెట్టయితే మేమే అధికారికంగా వివరణ ఇస్తామని వారి పేరెంట్స్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడైతే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలు కేవలం ఊహాగానాలే అనుకోవచ్చు.