Begin typing your search above and press return to search.

స్పిరిట్ స్పీడ్ పెంచే టైం వచ్చేసిందోచ్..!

ఐతే లేటెస్ట్ గా ప్రభాస్ స్పిరిట్ కి సంబంధించిన అప్డేట్ కూడా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమాను డిసెంబర్ నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   7 Nov 2024 8:30 PM
స్పిరిట్ స్పీడ్ పెంచే టైం వచ్చేసిందోచ్..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల స్పీడ్ పెంచాడు. బాహుబలితో ఐదేళ్లు రెండు సినిమాలకే పరిమితమయ్యాడన్న కామెంట్స్ రాగా అప్పటి నుంచి వరుస సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో రచ్చ కొనసాగిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ సలార్ 1 తో సత్తా చాటిన ప్రభాస్ రీసెంట్ గా కల్కి 2898 ఏడితో అదరగొట్టాడు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ చేస్తున్నాడు. దీనితో పాటు త్వరలోనే కల్కి 2 పనులు కూడా మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది.

ఐతే లేటెస్ట్ గా ప్రభాస్ స్పిరిట్ కి సంబంధించిన అప్డేట్ కూడా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమాను డిసెంబర్ నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారని తెలుస్తుంది. యానిమల్ తర్వాత సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. బాలీవుడ్ మేకర్ భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ నిర్మించనున్నారు.

స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని తెలుస్తుంది. ఐతే స్పిరిట్ డిసెంబర్ నుంచి మొదలు పెడితే ప్రభాస్ కూడా తన డేట్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ ఫౌజి కూడా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. కల్కి 2, ఫౌజి, స్పిరిట్ ఈ మూడు సినిమాలతో ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ పై తన మాస్ స్టామినా చూపించేందుకు రెడీ అవుతున్నాడు.

కల్కి 1 తో 1000 కోట్ల మార్క్ మళ్లీ రీచ్ అయిన ప్రభాస్ రాబోతున్న సినిమాలతో మరోసారి ఆ టార్గెట్ పెట్టుకున్నాడు. రాజా సాబ్ సినిమా 2025 ఏప్రిల్ లో రిలీజ్ అవుతుండగా నెక్స్ట్ ఇయర్ మరో సినిమా కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. హను రాఘవపుడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫౌజి సినిమా పీరియాడికల్ మూవీగా వస్తుంది కాబట్టి ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2 కోసం కొంత టైం కేటాయించాల్సి ఉంటుంది. ఐతే కల్కి 1 లోనే పార్ట్ 2 కి సంబంధించిన సీన్స్ షూట్ చేశారని తెలుస్తుంది. ఇక మరోపక్క ఫౌజి కోసం ప్రభాస్ కొత్త మేకోవర్ తో కనిపించనున్నాడు. స్పిరిట్ లో పోలీస్ పాత్రలో కూడా ప్రభాస్ అదరగొడతాడని తెలుస్తుంది. మరి ప్రభాస్ మార్క్ మాస్ మేనియా ఏంటో రాబోతున్న సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో చూపిస్తాడని చెప్పొచ్చు.