వారణాసి కుంభమేళాలో స్టీవ్ జాబ్స్ భార్య
లారెన్ పావెల్ జాబ్స్ ఆలయ సంప్రదాయాలను అనుసరిస్తున్నారని మహాకుంభమేళాకు హాజరై గంగలో స్నానం చేయాలని కూడా యోచిస్తున్నారని మహారాజ్ అన్నారు.
By: Tupaki Desk | 12 Jan 2025 4:52 AM GMTప్రపంచ కుభేరుడిగా, ప్రజా సేవికుడిగా దివంగత స్టీవ్ జాబ్స్ కి ఉన్న గొప్ప పేరు గురించి తెలిసిందే. పరోపకారి అయిన ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ ఆధ్యాత్మిక జీవితం నిరంతరం చర్చనీయాంశం. ఈ శుక్రవారం ఆమె భారతదేశంలోని వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. నిరంజని అఖారాకు చెందిన కైలాసానంద్ గిరి జీ మహారాజ్ తో కలిసి పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా గౌరవించే కాశీనాథుని ఆలయంలో ఆమె ప్రార్థనలు చేశారు.
ఆలయ అధికారులు పావెల్ జాబ్స్ ను సాంప్రదాయ ఆచారాలతో స్వాగతించారు. కాశీనాథుని ఆలయాన్ని ప్రతియేటా ఎందరో ప్రపంచ దిగ్గజాలు దర్శిస్తుంటారు. ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షించే ఈ ఆలయం ఆధ్యాత్మిక శోభ ఎప్పుడూ అందరినీ ఆకర్షిస్తూనే ఉంది. వారణాసిలో సాంస్కృతిక ప్రాముఖ్యత గురించి పావెల్ జాబ్స్ తన గౌరవాన్ని వ్యక్తం చేశారు.
భారతీయ సంప్రదాయం ప్రకారం కాశీ విశ్వనాథుని ఆలయంలో మరే ఇతర హిందువు శివలింగాన్ని తాకకూడదు. అందుకే ఆమెను బయటి నుండి శివలింగాన్ని చూడమని సూచించారు… ఆమె కూడా కుంభ్‌లో ఉండి గంగానదిలో స్నానం చేసేందుకు సిద్ధమవుతారని మహారాజ్ స్వయంగా అన్నారు. లారెన్ పావెల్ జాబ్స్ ఆలయ సంప్రదాయాలను అనుసరిస్తున్నారని మహాకుంభమేళాకు హాజరై గంగలో స్నానం చేయాలని కూడా యోచిస్తున్నారని మహారాజ్ అన్నారు.
13ఏళ్ల క్రితం స్టీవ్స్ అంతర్థానం:
2003లో కార్పొరెట్ దిగ్గజం స్టీవ్ జాబ్స్‌కు అరుదైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మరుసటి సంవత్సరం అతడి శరీరం నుంచి కణితిని తొలగించడానికి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ప్రకటించాడు. 2009లో జాబ్స్‌కు కాలేయ మార్పిడి జరిగింది. ఆగస్టు 2011లో అతడు ఆపిల్ సిఇవో పదవికి రాజీనామా చేశారు. రెండు నెలల తర్వాత 56 సంవత్సరాల వయస్సులో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సమస్యలతో మరణించారు.