Begin typing your search above and press return to search.

మళ్ళీ వార్తల్లోకి రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి.. ఈసారి టార్గెట్ ఎవరంటే?

కొన్నాళ్లుగా మీడియా ముందు కనిపించని లావణ్య.. సెకండ్ ఇన్నింగ్స్ తో వస్తున్నానంటూ సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   12 Jan 2025 8:31 AM GMT
మళ్ళీ వార్తల్లోకి రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి.. ఈసారి టార్గెట్ ఎవరంటే?
X

గతేడాది టాలీవుడ్ లో రచ్చ లేపిన వివాదాలలో హీరో రాజ్ తరుణ్ ఇష్యూ కూడా ఒకటి. రాజ్ తరుణ్ తనతో పదకొండేళ్లు సహజీవనం చేసి, వాడుకొని వదిలేసాడంటూ లావణ్య అనే యువతి పోలీసులను ఆశ్రయించింది. తనను నమ్మించి మోసం చేశాడని, ఇప్పుడు మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్ తో ప్రేమాయణం సాగిస్తున్నాడని ఆరోపిస్తూ కేసు పెట్టింది. కొన్నాళ్ళపాటు ఇదే వ్యవహరం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడిచింది. ఏమైందో ఏమో కానీ ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోయింది. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు మరోసారి ఈ వివాదం వార్తల్లోకి వచ్చింది.

కొన్నాళ్లుగా మీడియా ముందు కనిపించని లావణ్య.. సెకండ్ ఇన్నింగ్స్ తో వస్తున్నానంటూ సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది. ఈసారి మస్తాన్ సాయికి మూడిందని, అతని వ్యవహారాలన్నీ బయటపెడతానని తెలిపింది. ఇది లైంగిక వేధింపులు, డ్రగ్స్ అలాగే మనీకి సంబంధించిన స్టోరీ అని చెప్పింది. సోమవారం ఉదయానికి మస్తాన్ సాయి మొదటి వీడియోతోనే పని మొదలు పెడతానని పేర్కొంది. ఈ సందర్భంగా మీడియాకి కృతజ్ఞతలు తెలిపింది.

రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని, గర్భవతిని చేసి అబార్షన్ చేయించుకునేలా ఒత్తిడి తీసుకొచ్చాడని లావణ్య గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. తనకు వదిలేసి హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో డేటింగ్ మొదలు పెట్టాడని పోలీసులకు తెలిపింది. కానీ మస్తాన్ సాయి అనే యువకుడితో లావణ్య ప్రేమాయణం సాగిస్తూ తనను మోసం చేసిందని రాజ్ తరుణ్ ఆరోపించారు. ఆ సమయంలో లావణ్యతో పాటుగా మస్తాన్ సాయి కూడా కొన్ని మీడియా చర్చల్లో పాల్గొన్నాడు. అలాంటిది ఇప్పుడు అతని భాగోతాలను బయట పెడతానని లావణ్య చెప్పడం గమనార్హం. ఏదేమైనా లావణ్య పోస్టులో రాజ్ తరుణ్ వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఇకపోతే రాజ్ తరుణ్ - లావణ్య ఇద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ.. కేసులు పెట్టుకొని పోలీసుల విచారణ ఎదుర్కొన్నారు. మాల్వీ మల్హోత్రా సైతం లావణ్య మీద కేసు పెట్టింది. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగిస్తోందని పేర్కొంది. ఆ తర్వాత రాజ్ తరుణ్ - మాల్వీ వాట్సాప్ చాట్ లీక్ అవ్వడం, ఇద్దరూ హోటల్ లో ఉండగా లావణ్య వెళ్లి గొడవ చేయడం.. ఇలా అనేక విషయాలు జరిగాయి. ఆ సమయంలో మీడియాలో, సోషల్ మీడియాలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా నడిచింది.

వివాదం నెలకొన్న టైములోనే రాజ్ తరుణ్ నటించిన మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మాల్వీ మల్హోత్రాతో కలిసి నటించిన 'తిరగబడరసామీ'తో పాటుగా 'పురుషోత్తముడు', 'భలే ఉన్నాడే' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కాంట్రవర్సీ కారణంగా కొంతమేర పబ్లిసిటీ దొరికింది కానీ, ఈ సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం రాజ్ తరుణ్ "పాంచ్ మినార్" అనే చిత్రంలో నటిస్తున్నాడు.