కొత్త కోడళ్లు పాత న్యూస్ చెప్పేదెప్పుడు?
మరి 2025 లోనైనా మెగాకోడలు..అక్కినేని కోడలు తమ సినిమా అప్ డేట్స్ ఏవైనా ఇస్తారేమో చూడాలి.
By: Tupaki Desk | 12 Dec 2024 1:30 AM GMTలావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోనంత కాలం సినిమాలు..వెబ్ సిరీస్ లతో బిజీగానే గడిపారు. పెళ్లి కుదుర్చుకున్న తర్వాత కమిట్ అయిన ప్రాజెక్ట్ లు పూర్తి చేసారు. కానీ పెళ్లి తర్వాత మాత్రం లావణ్య పూర్తిగా ఇంటికే పరిమి తమైంది. వరుణ్ తేజ్ ని వివాహం చేసుకుని కొన్ని నెలలు గడుస్తున్నా? ఇంతవరకూ కొత్త సినిమా విశేషాలేవి లావణ్య రివీల్ చేయలేదు. అప్పటి నుంచి మీడియాలో కూడా పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆమె సినిమాలు చేస్తున్నారా? రిటైర్మెంట్ ఇచ్చేసారా? అన్న సందేహం సైతం వ్యక్తమవుతోంది.
అయితే అత్తింటి కుటుంబం నుంచి మాత్రం సినిమాలు చేసుకునే స్వేచ్ఛ ఉందని లావణ్య పెళ్లైన కొత్తలోనే చెప్పారు. అలాగే ఇటీవలే శోభిత ధూళిపాళ- నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్నారు. శోభిత బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చిన నటి. తెలుగు అమ్మాయే అయినా? హిందీ సినిమాలు చేసి తెలుగు కు ప్రమోట్ అయ్యారు. అయితే శోభిత- చైతన్యను పెళ్లిచేసుకుంటుందనే ప్రచారం నాటి నుంచే ఆమె నుంచి కొత్త సినిమా కమిట్ మెంట్లు ఏవీ బయటకు రాలేదు.
ప్రస్తుతానికి ఆమె లైనప్ అంతా ఖాళీగానే ఉంది. అలాగని పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అవుతానని చెప్పింది లేదు. వృత్తి గత జీవితంలోనే యధావధిగా కొనసాగే స్వేచ్ఛ ఉంది. కానీ కొత్త ప్రాజెక్ట్ ల వివరాలు మాత్రం ఇంతవరకూ ప్రకటించలేదు. మరి 2025 లోనైనా మెగాకోడలు..అక్కినేని కోడలు తమ సినిమా అప్ డేట్స్ ఏవైనా ఇస్తారేమో చూడాలి.
ఇక లావణ్య భర్త వరుణ్ తేజ్ మాత్రం పుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ మధ్య సక్సెస్ జోరు తగ్గినా కొత్త సినిమా కమిట్ మెంట్లు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే వరుణ్ పాన్ ఇండియా అటెంప్ట్ లు కూడా చేసాడు. కానీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఇక నాగచైతన్య 'తండేల్' తో తొలి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.