Begin typing your search above and press return to search.

మొదలైన లావణ్య 'సతీ లీలావతి' ప్రయాణం

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి కొత్త చిత్రం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

By:  Tupaki Desk   |   3 Feb 2025 11:23 AM GMT
మొదలైన లావణ్య సతీ లీలావతి ప్రయాణం
X

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి కొత్త చిత్రం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి 'సతీ లీలావతి' అని టైటిల్ పెట్టారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌ వంటి విభిన్న చిత్రాలతో పేరు తెచ్చుకున్న తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


సతీ లీలావతి చిత్రం సోమవారం రామోజీ ఫిల్మ్ సిటీలోని సంఘి హౌస్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నిర్మాతలు హరీష్ పెద్ది, వి. ఆనంద ప్రసాద్, జెమినీ కిరణ్ వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు. నిర్మాత హరీష్ పెద్ది ముహూర్తపు క్లాప్ కొట్టగా, వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. టి.ఎల్‌.వి.ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు.


ఇందులో లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లావణ్య త్రిపాఠి ఇప్పటికే తన టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమెకు ఈ చిత్రం మరింత పేరు తెచ్చిపెట్టే అవకాశముంది. దేవ్ మోహన్ కూడా తన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందేలా చేస్తున్నారు. చిత్ర బృందం ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది.


ఈ కార్యక్రమంలో మాట్లాడిన దర్శకుడు తాతినేని సత్య, "సతీ లీలావతి చిత్రం రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు. లావణ్య, దేవ్ మోహన్ జంట ఫ్రెష్ లుక్‌తో అలరిస్తారని తెలిపారు. ఈరోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం," అని చెప్పారు.

చిత్ర నిర్మాతలు నాగమోహన్ బాబు, రాజేష్ మాట్లాడుతూ, "మా చిత్రం ఆడియెన్స్‌కు అన్ని విధాలా కనెక్ట్ అవుతుందని నమ్మకం ఉంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సహకారం మా చిత్రానికి మరింత బలం చేకూర్చింది," అని తెలిపారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రత్యేకంగా హాజరై అభినందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని, సతీ లీలావతి చిత్రం ప్రేక్షకుల మనసులను గెలుచుకునేలా ఉంటుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక లావణ్య త్రిపాఠి ఈ చిత్రంతో మరో మెమరబుల్ పాత్రను తన ఖాతాలో జమ చేసుకోవాలని ఆశిస్తోంది. మరి సినిమా ఎలాంటి ఫలితన్ను ఇస్తుందో చూడాలి.