Begin typing your search above and press return to search.

స‌తీ లీలావ‌తి సినిమా అంతా చీర‌లోనేనా!

`స‌తీలీలావ‌తి` అంటూ లేడీ ఓరియేంటెడ్ చిత్రం ప్రారంభించింది. ఓ కొత్త కాన్సెప్ట్ తో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య తెలిపారు.

By:  Tupaki Desk   |   16 Dec 2024 3:30 PM GMT
స‌తీ లీలావ‌తి సినిమా అంతా చీర‌లోనేనా!
X

ఎట్ట‌కేల‌కు మెగా కోడ‌లు లావ‌ణ్య త్రిపాఠి మ‌ళ్లీ న‌టిగా కంబ్యాక్ అవుతుంది. మెగా ఇంట కోడ‌లిగా అడుగు పెట్టిన త‌ర్వాత కొత్త సినిమా విష‌యం ఎప్పుడు చెబుతుందా? అని అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో లావ‌ణ్య ఏకంగా సినిమా లాంచింగ్ తోనే స‌ర్ ప్రైజ్ చేసింది. `స‌తీలీలావ‌తి` అంటూ లేడీ ఓరియేంటెడ్ చిత్రం ప్రారంభించింది. ఓ కొత్త కాన్సెప్ట్ తో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య తెలిపారు.

ఇప్ప‌టివ‌ర‌కూ లావ‌ణ్య కెరీర్ లో పోషించ‌ని ఓ కొత్త పాత్ర‌ను పోషిస్తుంది. ఇందులో లావ‌ణ్య పాత్ర చాలా భిన్నంగా ఉంటుంద‌ని ప్రేక్ష‌కుల్ని స‌ర్ ప్రైజ్ చేస్తుంద‌ని యూనిట్ ధీమా వ్య‌క్తం చేసింది. ఇంత‌వ‌ర‌కూ యూనిట్ నుంచి సినిమా గురించి అధికారికంగా వ‌చ్చిన స‌మాచారం. అయితే ఈ సినిమాలో మ‌రో స్పెష‌ల్ ఉంద‌ని తాజాగా లీక్ అందింది. ఇందులో లావ‌ణ్య సినిమా మొద‌లు నుంచి ముగింపు వ‌ర‌కూ చీర‌..ర‌విక‌లోనే క‌నిపిస్తుందిట‌.

ఎలాంటి మోడ్ర‌న్ దుస్తులు ధ‌రించ‌డం గానీ, ఉత్త‌రాది ప్లేవ‌ర్ డిజైన్స్ ని ట‌చ్ చేయ‌డం కానీ ఎక్క‌డా ఉండ‌ద‌ట‌. అచ్చ‌మైన తెలుగు అమ్మాయి చీర క‌డితే ఎంత అందంగా ఉంటుందో? అంతే అందంగా లావ‌ణ్య తో పాటు, పాత్ర ఉంటుందంటున్నారు. ద‌ర్శ‌కుడు ఆ ర‌కంగా లావ‌ణ్య పాత్ర‌ని డిజైన్ చేసిన‌ట్లు వినిపిస్తుంది. అంటే లావ‌ణ్య చీర‌కి..ఈ సినిమా కాన్సెప్ట్ కి చాలా ద‌గ్గ‌ర సంబంధం కూడా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలి.

ఇక లావ‌ణ్య కెరీర్ ఆరంభం నుంచి గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగానే ఉంది. తెర‌పై గ్లామ‌ర్ షో, స్కిన్ షోలు వంటి వాటి జోలికి వెళ్ల‌లేదు. వీలైనంత వర‌కూ సంప్రదాయ దుస్తుల్లోనే క‌నిపిస్తుంది. పోషించిన పాత్ర‌లు అంతే హుందాగా ఉంటాయి. ఇప్పుడీ చీర కాన్సెప్ట్ కూడా ఆమె రియ‌ల్ లైఫ్ కి బాగా క‌నెక్టింగ్ గానే క‌నిపిస్తుంది.