మెగా లావణ్య.. గోల్డెన్ లుక్‌తో స్టన్నింగ్!
గోల్డెన్ కలర్ గౌన్, డీప్ నెక్ డిజైన్, సాలిడ్ ఫిట్‌తో కటౌట్‌గా మెరిసిపోతూ ఫుల్ గ్లామ్ టచ్ ఇచ్చింది.
By: Tupaki Desk | 7 March 2025 4:31 PMలావణ్య త్రిపాఠి మరోసారి తన గ్లామర్‌తో నెట్టింట హీట్ పెంచేసింది. మెగా కోడలుగా మారిన తర్వాత ఆమె లైఫ్‌స్టైల్ మరింత హైలైట్ అవుతోంది. రీసెంట్‌గా ఆమె షేర్ చేసిన గోల్డెన్ గౌన్ ఫోటోలు వైరల్‌గా మారాయి. మెరుస్తున్న డిజైనర్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో అదరగొట్టిన లావణ్య, తన అందంతో మైమరపించింది. గోల్డెన్ కలర్ గౌన్, డీప్ నెక్ డిజైన్, సాలిడ్ ఫిట్‌తో కటౌట్‌గా మెరిసిపోతూ ఫుల్ గ్లామ్ టచ్ ఇచ్చింది.
మెగా ఫ్యామిలీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత లావణ్య కెరీర్ కాస్త స్లో అయినా, సోషల్ మీడియాలో మాత్రం ట్రెండ్ అవుతూనే ఉంది. వరుణ్ తేజ్‌తో మ్యారేజ్ తర్వాత మరింత బ్యూటీఫుల్ లుక్స్‌తో కనిపిస్తూ, ఫ్యాషన్ గేమ్‌ని ఓ లెవెల్‌కి తీసుకెళ్లింది. తాజా ఫోటోషూట్‌లో ఆమె క్లాసీ మెకప్, వేవీ హెయిర్‌స్టైల్, స్మోకీ ఐ మేకప్‌తో రెడ్ లిప్‌స్టిక్ టచ్.. ఒక పర్ఫెక్ట్ గ్లామరస్ ఏంజెల్ లా తయారైంది.
ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు, అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘మెగా కోడలు స్టన్నింగ్, గోల్డ్ గర్ల్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవల వెబ్ సిరీస్ ‘మిస్ పర్‌ఫెక్ట్’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న లావణ్య.. ఇప్పుడు ‘సతీ లీలావతి’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ అవుతోంది. భీమిలి కబడ్డీ జట్టు ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి.
లావణ్య ఈ మూవీలో తన నటనతో మరోసారి మెప్పించేందుకు రెడీ అవుతోంది. అయితే లావణ్య తాజా గోల్డెన్ లుక్ చూసిన అభిమానులు ఆమె మరింత ఫ్యాషన్ ఫ్రీక్‌గా మారిందని అంటున్నారు. మరి ఈ కొత్త అవతార్‌తో ఆమె సినీ కెరీర్‌కి మళ్లీ జోష్ తెచ్చుకుంటుందా? వెయిట్ చేసి చూడాలి.